S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/21/2018 - 00:50

విజయవాడ, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంపై తాను సాగిస్తున్న ధర్మ పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఐదుకోట్ల ప్రజలు తన వెనుక ఉంటే వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుని దేశ ప్రధాని ఎవరో మనమే నిర్ణయిద్దామన్నారు.

04/20/2018 - 16:45

హైదరాబాద్‌: తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను శుక్రవారం మహిళా సంఘాలు కలిశాయి. చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి..
హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి... త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మహిళా సంఘాలకు హామీ ఇచ్చారు.

04/20/2018 - 16:37

విజయవాడ: చంద్రబాబు ధర్మాపోరాట దీక్షలో సినీనటుడు బాలకృష్ణ మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది నిజం కాదా ఆని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్ వస్తుందని అన్నారు.

04/20/2018 - 16:36

హైదరాబాద్: మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం జనసేన కార్యాలయంలో లాయర్లతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆడవాళ్లను అవమానించేందుకే చంద్రబాబుకు ఓటేసిందని విమర్శించారు. సాయంత్రం ఐదు గంటలకు జనసేన కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

04/20/2018 - 16:33

విజయవాడ: చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగ జపం వంటిదని ఏపీ పీసీసీ ప్రెశిడెంట్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినవారిని జైల్లో పెట్టించిన చంద్రబాబు ఇపుడు యూటర్న్ తీసుకుని దీక్ష చేయటం హాస్యాస్పదం అని అన్నారు.

04/20/2018 - 13:55

పుట్టపర్తి: సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ప్రభుత్వ చీఫ్ విప్ పల్లెరఘునాథ్‌రెడ్డి పుట్టపర్తిలో దీక్షకు దిగారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.

04/20/2018 - 13:43

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. కాంగ్రెస్ సినీయర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో వెంకట్ రెడ్డి, సంపత్, న్యాయవాది జంధ్యాల శంకర్‌తో కలిసి ఈసీకి తీర్పు కాపీని ఇచ్చారు.

04/20/2018 - 12:43

అమరావతి: ‘రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందే’ అనే నినాదంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తలపెట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఉదయం 7 గంటలకు సీఎం చంద్రబాబు దీక్షలో కూర్చుకున్నారు. రాత్రి 7 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. సీఎం దీక్షలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

04/20/2018 - 12:38

విజయవాడ: విజయవాడలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట‌ దీక్షలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని మోదీపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజ్యాంగంతో పాటు తన భార్యను కూడా గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌.

04/20/2018 - 12:24

హైదరాబాద్‌: సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫిలిం ఛాంబర్‌ వద్ద నిరసన తెలిపారు. తన సోదరుడు నాగబాబు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాతో కలిసి శుక్రవారం ఫిలిం ఛాంబర్‌ వద్దకు వచ్చిన పవన్‌ మీడియా వ్యవహారశైలిపై నిరసన తెలిపారు. శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడం, తర్వాత పునరుద్ధరించడం తదనంతరం పరిణామాలపై ఆయన ‘మా’ సభ్యులతో చర్చించారు.

Pages