S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/19/2018 - 01:55

శ్రీశైలం టౌన్, జూలై 18: నల్లమల ప్రాంతంలో అరుదైన శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం సమీపంలో ఓ ఇంట్లో ఈ పాము కనిపించింది. ఇంటిపరసరాల్లో తిరుగుతున్న పామును గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకున్నారు.

07/19/2018 - 05:10

బళ్ళారి, జూలై 18: కర్నాటక, ఆంధ్ర రైతులకు జీవనాడిగా పేరుగాంచిన తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండింది. దీంతో బుధవారం జలాశయం గేట్లు ఎత్తారు. 12 గేట్లను సుమారు అడుగు మేర ఎత్తి దిగువ నదిలోకి 10 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1630.04 అడుగులకు చేరుకుంది.

07/19/2018 - 01:42

అమరావతి, జూలై 18: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలోగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

07/19/2018 - 05:14

ఆచంట, జూలై 18: ప్రజాసమస్యలు పరిష్కరించాకే ఓట్లు అడుగుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని గాంధీబొమ్మల సెంటర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. అక్టోబర్ నుంచి రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు.

07/19/2018 - 05:18

రాజమహేంద్రవరం, జూలై 18: గోదావరి నదిలో వరద నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భద్రాచలం వద్ద ఉద్ధృతి కొనసాగినా రాత్రి సమయానికి నిలకడగా మారింది.

07/19/2018 - 05:16

కాకినాడ, జూలై 18: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీతో బయటకు యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూనే లోపల మాత్రం వారి కాళ్లు మొక్కుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుపడితే చంద్రబాబు వంగిపోతారని, గత నాలుగేళ్ళుగా బీజేపీ వద్ద సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.

07/19/2018 - 01:22

హైదరాబాద్, జూలై 18: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో యూజీ, పీజీ విద్యార్ధుల జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రక్రియను జేఎన్‌టీయూ చేపట్టగా, తెలంగాణలోని సంప్రదాయ వర్శిటీల్లో ఆన్‌లైన్ మూల్యాంకనం చేపట్టిన తొలి యూనివర్శిటీగా ఉస్మానియా యూనివర్శిటీ ఖ్యాతి గడించింది.

07/19/2018 - 01:21

హైదరాబాద్, జూలై 18: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో యూజీ కోర్సులో చేరేందుకు ఈ నెల 20వ తేదీ నుండి తుది దశ ఎమ్సెట్ కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్, సీనియర్ ఐఎఎస్ అధికారి నవీన్ మిట్టల్ చెప్పారు.

07/19/2018 - 01:17

హైదరాబాద్, జూలై 18: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వరకూ వెళ్లదని టీఆర్‌ఎస్ అంచనా వేస్తున్నది. ఏది ఎలావున్నా, ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది.

07/19/2018 - 05:20

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలో వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. సాంప్రదాయ విధానాల స్థానంలో ఆధునిక విధానాలు అమల్లోకి వస్తున్నాయి. వరిపంటకు సంబంధించి నాట్లు వేసే పనిలో మహిళా కూలీలు పనిచేసేవారు. మారిన కాలమాన పరిస్థితిలో కూలీలు దొరకడం ఇబ్బందికరంగా మారింది. దాంతో నాట్లు వేసేందుకు యంత్రాలను ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రైతులకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Pages