S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/18/2018 - 00:21

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ కొత్త నాటకాలకు తెరలేపిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాల చిట్టా తమవద్ద ఉందని ఆ పార్టీని హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏదో చేసేస్తాం అంటూ తెలుగుదేశం ఎంపీలు విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు.

07/18/2018 - 05:12

తిరుపతి, జూలై 17: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న అష్టదిగ్బంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకూడదనే దర్శనాల రద్దుపై ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని టీటీడీ పాలక మండలి ప్రకటించింది. ఈ నెల 24 తేదీన ఈ విధానంపై పూర్తి స్థాయి పునస్సమీక్షించి దర్శనంపై విధి విధానాలను ఖరారుచేసే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

07/18/2018 - 00:17

హైదరాబాద్, జూలై 17: శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి దేశద్రోహం చేశారా అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వామిని నగర బహిష్కరణ ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపూర్ణానంద అరెస్టుపై చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

07/18/2018 - 00:16

బళ్ళారి, జూలై 17: తుంగభద్ర జలాశయం వేగంగా నిండుతోంది. మరో ఐదు అడుగుల మేర నీరు చేరగానే జలాశయం పూర్తిగా నిండుతుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని రెండు, మూడు రోజుల్లో జలాశయం నిండుతుందని, అనంతరం గేట్లు ఎత్తి దిగువ నదిలోకి నీరు విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.

07/18/2018 - 00:15

పెదపూడి, జులై 17: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర 214వ రోజైన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. ఉదయం 8.30గంటలకు అనపర్తి నియోజకవర్గంలోని కరకుదురు నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఆచ్యుతాపురత్రయం, రామేశ్వరం మీదుగా కొనసాగింది. పాదయాత్ర భారీ జనసందోహం మధ్య ఉత్సాహభరితంగా సాగింది.

07/17/2018 - 16:47

విజయనగరం:ఏపీ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని, వేల కోట్లు సంపాదించినవారే పార్టీని వీడారని విమర్శించారు.

07/17/2018 - 16:45

పశువుల్లంక: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. ఈ రోజు గాలింపులో ఎలాంటి ఫలితం లేదని అన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. మంగళవారంనాడు యానం, సావిత్రినగర్, భైరవపాలెం కేంద్రంగా సెర్చ్ కొనసాగింది.

07/17/2018 - 19:59

తిరుమల: మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆలయ ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆలయాన్ని మూసివేయాలనే నిర్ణయంపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు.

07/17/2018 - 02:07

హైదరాబాద్, జూలై 16: అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆగస్టు 3, 10 శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి జైపూర్‌కు ప్రత్యే రైలు బయలుదేరుతుంది. కాగా తిరుగు ప్రయాణంలో జైపూర్ నుంచి హైదరాబాద్‌కు ఆగస్టు 5, 12 (ఆదివారం) తేదీల్లో ప్రత్యేక రైలు బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది.

07/17/2018 - 01:53

హిందూపురం, జూలై 16: సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పార్టీని వేగవంతంగా మరింత బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ముమ్మర చర్యలు చేపట్టింది.వచ్చే సార్వత్రిక ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐవీఆర్‌ఎస్ పద్ధతిలో ప్రభుత్వం పనితీరుపై ఫోన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. సీఎం నుంచే ప్రజలకు ఫోన్లు వస్తున్నాయి.

Pages