S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/13/2018 - 02:32

హైదరాబాద్, జూలై 12: దేశంలో ఉన్నత విద్యపై పర్యవేక్షణకు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ కమిషన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

07/13/2018 - 00:40

కరీంనగర్, జూలై 12: ప్రభుత్వాలు ఎన్ని మారినా కౌలు రైతుల కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. దినదినగండంగా సాగుతున్న వారి బతుకులపై పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కష్టాలకు కన్నీళ్లే మిగిలాయ. ఓవైపు పెట్టుబడి సాయానికి దూరమె, మరోవైపు బ్యాంకుల్లో రుణాలు లభించక సతమతమవుతున్నారు. అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ అప్పుల కోసం ప్రదక్షిణలు.

07/13/2018 - 00:36

హైదరాబాద్, జూలై 12: తెలంగాణలోని అన్ని జిల్లాలకు త్వరలోనే విమానయోగం పట్టనుంది. ప్రతి జిల్లాకూ విమాన సౌకర్యం కల్పించడానికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నెల రోజుల్లో ముసాయిదా నివేదిక సమర్పించాలని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. సచివాలయంలో గురువారం స్టేట్ ఏవియేషన్ అకాడమీ మేనేజింగ్ కమిటీ సిఎస్ జోషి అధ్యక్షతన జరిగింది.

07/13/2018 - 01:19

హైదరాబాద్, జూలై 12: తెలంగాణలో ఆధిపత్యాన్ని సంపాదించడంతోపాటు, సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు అమిత్ షా నేరుగా పాట్నా నుండి హైదరాబాద్ వస్తారు. అనంతరం ఆయన 5వేల మంది కార్యకర్తల బైక్‌ర్యాలీ మధ్య పార్టీ కార్యాలయానికి 11 గంటలకు చేరుకుంటారు.

07/13/2018 - 00:30

హైదరాబాద్, జూలై 12: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్ నుంచి ఆయన ఫైస్‌బుక్ లైవ్ నిర్వహించి పార్టీ కార్యాకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

07/13/2018 - 02:59

హైదరాబాద్/నాగర్‌కర్నూల్: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 4,383 గ్రామ పంచాయతీలు ఆగస్టు 2 నుండి పనిచేయడం ప్రారంభం అవుతుందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్‌డీఓలు, జెడ్‌పీ సీఈఓలతో మాట్లాడారు.

07/13/2018 - 00:27

హైదరాబాద్, జూలై 12: ముందస్తు ఎన్నికల దిశగా ‘కారు’ స్పీడ్ పెంచింది. ఒకవైపు ముందస్తుకు అవకాశం లేదని బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినప్పటికీ మరోవైపు టీఆర్‌ఎస్ మాత్రం ముందస్తు ఎన్నికలు ఉంటాయనే పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహరచనలో తలమునకలైనట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

07/13/2018 - 01:11

విజయవాడ: దేశంలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో తన చాంబర్‌లో రోజువారీ విద్యుత్ వినియోగంపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు

07/13/2018 - 00:21

నెల్లూరు, జూలై 12: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపై ఉంటుందని రాష్ట్ర పిసిసి వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ తెలిపారు. గురువారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5కోట్ల ఆంధ్ర ప్రజలను బీజేపీ, టీడీపీలు మోసం చేశారని తెలిపారు. పార్లమెంటులో చట్టం చేసిన ఏ అంశాన్ని కూడా బీజేపీ పార్టీ అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.

07/13/2018 - 02:38

విశాఖపట్నం, జూలై 12: ‘పోలవరం ఏ ఒక్క పార్టీ ప్రాజెక్ట్ కాదు. అది జాతీయ ప్రాజెక్ట్. దీనిపై రాజకీయం చేయడానికి తాము సిద్ధంగా లేము.’అని కేంద్ర నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Pages