S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/10/2018 - 16:48

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొనసీమలో పొలాలు ముంపుబారిన పడ్డాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ఉధృతి వల్ల రాజమహేంద్రవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. వర్షాల కారణంగా అనపర్తి నియోజకవర్గంలో జగన్ చేపట్టాల్సిన పాదయాత్ర ఆగపోయింది. జగన్ బిక్కవోలు నుంచి పాదయాత్ర చేయాల్సి ఉంది.

07/10/2018 - 14:00

భద్రాచలం: గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. గోదావరి నీటిమట్టం 26.3 అడుగులకు చేరింది. గోదావరిలోకి ప్రజలు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు కూడా గోదావరిలో కలిసిపోతుంది. దీంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు.

07/10/2018 - 13:42

నార్నూర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అపహరణకు గురైన మగ శిశువు కథ సుఖాంతమైంది. చోర్‌గావ్ గ్రామానికి చెందిన గణేశ్ భార్య మమతకు మగశిశువు జన్మించాడు. సోమవారం అర్థరాత్రి ఈ శిశువు అపహరణకు గురైంది. ఆదిలాబాద్ డీఎస్పీ నర్శింహరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు.

07/10/2018 - 04:23

హైదరాబాద్, జూలై 9: ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నెలకోల్పిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ జంషెడ్ బరూచా నియమితులయ్యారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన బరూచా నియామకంతో యూనివర్శిటీకి అంతర్జాతీయ స్థాయి లభించినట్టయిందని వర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

07/10/2018 - 04:14

హైదరాబాద్, జూలై 9: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు గమ్యస్ధానాలకు 117 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే వెల్లడించింది.

07/10/2018 - 01:56

తిరుపతి, జూలై 9: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి ఏడాది నాలుగుసార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని టీటీడీ ఆనవాయితీగా పాటిస్తోంది.

07/10/2018 - 02:04

హైదరాబాద్, జూలై 9: శ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద చేపట్టిన ‘ధర్మాగ్రహ’ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదని, గొడవలకు కారణమవుతుందని భావించి అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదయం పరిపూర్ణానందను జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ఆయనను బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు గృహ నిర్భంధం చేశారు. నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

07/10/2018 - 01:49

హైదరాబాద్, జూలై 9: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’ ఊహించని విధంగా విజయవంతమైంది. రోజూ పదివేల నమూనాలను (శాంపిళ్లను) పరీక్షించే సామర్థ్యం గల ఈ కేంద్రం రాష్ట్రంలో అత్యంత అధునాతన వైద్య పరీక్షా కేంద్రంగా పేరుతెచ్చుకుంది.

07/10/2018 - 01:46

మలికిపురం, జూలై 9: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో సోమవారం చోటుచేసుకున్న మరో గ్యాస్ లీకేజీ ఘటన ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఓఎన్జీసీకి చెందిన కేశనపల్లి వెస్ట్ స్ట్రక్చర్ పరిధిలోని వెల్ నెంబర్ 37 నుండి కేశనపల్లి జీసీఎస్‌కు అనుసంధానమయ్యే పైపులైనుకు జీసీఎస్ సమీపంలోనే లీకేజీ ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి దాదాపు రెండు గంటల పాటు ముందుగా గ్యాస్ భారీ స్థాయిలోను, తర్వాత వైట్ క్రూడాయిల్ ఎగసిపడింది.

07/10/2018 - 01:43

గుంటూరు, జూలై 9: అమరావతి రాజధాని నిర్మాణ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు కేంద్రానికి తప్పుడు నివేదికలు అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకద్రోహం తలపెట్టారని, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చుపెట్టారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ విమర్శించారు.

Pages