S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/10/2018 - 01:42

హైదరాబాద్, జూలై 9: స్వామి పరిపూర్ణానంద చేయతలపెట్టిన ధర్మాగ్రహ యాత్రను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ నేతలు, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంస్థల నాయకులు వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

07/10/2018 - 00:56

హైదరాబాద్, జూలై 9: తనపై పార్టీ నేతలు బాహాటంగా ఆరోపణలకు దిగడం, వాటిపై పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరణ ఇచ్చేందుకైనా అవకాశం ఇవ్వకపోవడంతో ఇక టీఆర్‌ఎస్‌లో కొనసాగే అవకాశం లేనట్టేనని రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సన్నిహితులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియకుండా పార్టీ నేతలు తనపై ఆరోపణలకు దిగారని భావించడం లేదని కూడా ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం.

07/10/2018 - 04:55

గోదావరిఖని: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తాను ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఆర్టీసీ చైర్మన్ వ్యాఖ్యలు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. ఈ పరిణామం ఊహించని చర్చకు దారి తీసింది. రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాస

07/10/2018 - 00:50

హైదరాబాద్, జూలై 9: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ చేపట్టిన భారత్ బచావో ఆందోళన కార్యక్రమం మలుపు తిరిగింది. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మంత్రి కే.

07/10/2018 - 00:46

హైదరాబాద్, జూలై 9: మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత, విశే్లషకుడు కత్తి మహేశ్‌కు ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధిస్తూ తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యంతరకరమైన వాఖ్యలతో కూడిన క్లిప్పింగ్స్‌ను పదేపదే ప్రసారం చేసిన ఒక టీవీ చానెల్‌కు నోటీసులు పంపింది.

07/10/2018 - 00:40

ఖమ్మం, జూలై 9: కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం ఉన్నప్పటికీ, కొందరు నేతల వైఖరి వల్ల అది సన్నగిల్లుతోందని, అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేదిలేదని ఐఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేతలతో పలు అంశాలపై చర్చించేందుకు సోమవారం ఖమ్మం వచ్చిన ఆయనకు పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి స్వాగతం చెప్పారు. అనంతరం నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష నిర్వహించారు.

07/10/2018 - 00:38

విజయవాడ, జూలై 9: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తొలిసారిగా ఒకేసారి 44 వేల బూత్ స్థాయి కమిటీలను వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ తెలిపారు.

07/10/2018 - 00:36

అమరావతి, జూలై 9: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పాలనా నగరంగానే కాకుండా ప్రపంచ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. పారిశ్రామికంగా ఇప్పటికే మొబైల్ నుంచి ఆటోమొబైల్ రంగం వరకు అభివృద్ధి సాధించామని, పరిశ్రమల స్థాపనకు స్వర్గ్ధామంగా ఉన్న ఏపీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తామని స్పష్టంచేశారు.

07/10/2018 - 00:22

హైదరాబాద్, జూలై 9: దేశంలో ఇక మీదట నీట్, జేఈఈ, యూజీసీ నెట్, సీ మ్యాట్‌లను ఏటా రెండు మార్లు నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు ఈ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ)కు అప్పగించడంతో పరీక్షల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది వరకూ ఆన్‌లైన్‌లో, పాత సిలబస్, పాత ప్యాటర్న్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. తదుపరి పరీక్ష నుండి కొన్ని మార్పులను చేయనున్నారు. యూజీసీ నెట్

07/10/2018 - 00:20

తిరుపతి, జూలై 9: కడపలో ఉక్కు కర్మాగారానికి పునాదిరాయి పడేంత వరకు గడ్డం తీయనని, పోరు ఆపనని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వెంకన్న సాక్షిగా తిరుమలలో ప్రతిజ్ఞ చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే.

Pages