S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/27/2018 - 00:14

విజయవాడ, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలనే అంకితభావం, చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వంలో అణువణువునా ఉందని, ఈ చిత్తశుద్ధి లేనిది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులోనే లేదంటూ బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంద్రీశ్వరి అన్నారు. మంగళవారం నాడిక్కడ జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.

06/27/2018 - 00:09

విజయవాడ, జూన్ 26: రాష్ట్రానికి న్యాయం విషయంలో కేంద్రంపై పోరాటంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైకాపాకు సొంత మైకులా, బీజేపీకి అద్దె మైకులా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తయారయ్యాయని ఎద్దేవా చేశారు.

06/27/2018 - 02:57

విజయనగరం, జూన్ 26: రాష్ట్రంలో ఎంటీయూ 1001 రకం వరి విత్తనానికి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ రకం విత్తనాలను నిషేధించాలని నిర్ణయించింది. ఈ ఖరీఫ్‌లో ఈ రకాన్ని పరిమితంగా పంపిణీ చేసి వచ్చే ఏడాది నుంచి పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్టు వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.

06/26/2018 - 17:48

కడప: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు డీఎంకే] మద్దతు ప్రకటించింది. ఈ మేరకు డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి కడపకు వచ్చి సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు.

06/26/2018 - 16:28

హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీసీలకు ఏ ప్రాతిపదికన 34% రిజర్వేషన్లు కేటాయించారని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

06/26/2018 - 13:51

విశాఖ:మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.

06/26/2018 - 13:43

కడప: తాను టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు ఇక్కడకు రాలేదని... ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడ్డ నేతలకు సంఘీభావం ప్రకటించేందుకే వచ్చానని సినీనటుడు శివాజీ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలను ఈరోజు ఆయన పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.

06/26/2018 - 13:35

కడప: ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిల ఆరోగ్యం మరింత క్షీణించింది. మంగళవారంతో వారి దీక్ష ఏడోరోజుకు చేరుకుంది. బీటెక్‌ రవి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీక్ష చేస్తున్నప్పటి నుంచి బీటెక్‌ రవి 7 కిలోలు, సీఎం రమేశ్‌ 4 కిలోలు బరువు తగ్గినట్లు చెప్పారు.

06/26/2018 - 13:01

విజయవాడ: కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కడప స్టీల్ ప్లాంట్, సీఎం రమేష్ దీక్ష, బైక్ ర్యాలీలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

06/26/2018 - 12:53

విజయవాడ: పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని కేంద్రంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ..

Pages