S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2018 - 05:55

విజయవాడ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జూల్ 9 నాటికి డౌన్ స్ట్రీమ్ జెట్ గ్రౌటింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

06/26/2018 - 05:47

తిరుపతి, జూన్ 25: తిరుమల శ్రీవారి వార్షిక జ్యేష్ఠ్భాషేకంలో భాగంగా రెండో రోజు సోమవారం ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను మురిపించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, వేద పారాయణ దారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు.

06/26/2018 - 05:10

హైదరాబాద్, జూన్ 25: ప్రయాణీకులకు సౌకర్యాలను మెరుగుపర్చే క్రమంలో రైలు కోచ్‌లకు వేగంగా నీటిని అందించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. అలాగే కొన్ని ప్రధాన స్టేషన్లలో కోచ్‌లను శుభ్రం చేసేందుకు ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ మెషీన్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.

06/26/2018 - 05:56

ధర్మపురి: ప్రాచీన సంస్కృతికి, సనాతన సంప్రదాయాలకు తెలంగాణ పట్టుకొమ్మని, ఈ నేలకు చరిత్రకు అందనంత పూర్వపు నేపథ్యం ఉందని రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన అనంతరం ఆంధ్రభూమితో ఆయన మాట్లాడారు.

06/26/2018 - 01:12

హైదరాబాద్, జూన్ 25: ముందస్తు ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ముందస్తుకు వెళితే ఏం జరుగుతుందో తమకు, కాంగ్రెస్‌కు, ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఈ విషయం తెలిసే ఆ పార్టీ నేతలు చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

06/26/2018 - 00:58

తిరుపతి, జూన్ 25: శ్రీవారి ఆభరణాలు మహాభద్రంగా ఉన్నాయని, భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని టీటీడీ పాలకమండలి చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు.

06/26/2018 - 00:54

గంగవరం/పలమనేరు, జూన్ 25: చిత్తూరు జిల్లాలో ఏనుగులు అడవులు వదలి గ్రామాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గంగవరం మండల పరిధిలోని కీలపట్ల పంచాయతీకి చెందిన గాంధీనగర్ పంటపొలాలపై ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసింది. దాడుల్లో గ్రామంలో క్యాబేజీ, టమోటా, మామిడి, పశువుల గడ్డి పంటలను పూర్తిగా తిని తొక్కి ధ్వంసం చేశాయి.

06/26/2018 - 01:00

ఇబ్రహీంపట్నం, జూన్ 25: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలం లింగంపల్లి గేటు సమీపంలో సోమవారం తెల్లవారుజామున 6 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా రైతులుసహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన నలుగురు మహిళులు రైతులే. మృతుల్లో ఆటో డ్రైవర్ ఉన్నారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. బయటపడ్డ వారిలో ఒక మహిళా రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

06/26/2018 - 00:33

హైదరాబాద్, జూన్ 25: స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూలో (రాష్ట్ర సొంత ఆదాయం) దేశంలోనే తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర సగటు ఆదాయ వృద్ధి రేటు 17.2 శాతంతో ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచిందని కంప్ట్రోర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు గణాంకాలను కాగ్ తన వెబ్‌సైట్లో పేర్కొంది.

06/26/2018 - 00:32

హైదరాబాద్, జూన్ 25: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానంతరం ఉత్తమ్, కుంతియా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ రోజే గవర్నర్‌ను కలిసి తన పదవికి రాజీనామా చేస్తానంటే వద్దంటామా?

Pages