S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2018 - 00:29

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు సమాయత్తం అవుతున్నారు. తమను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమిస్తున్నారంటూ ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు రగిలిపోతున్నారు. జూనియర్, సీనియర్ అనే తేడాలేకుండా ప్రాధాన్యతలేని పోస్టుల్లో నియమిస్తూ, ఉన్నత వర్గాలకు చెందిన ఐఏఎస్‌లకు కీలక పోస్టులు అప్పగిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

06/26/2018 - 00:24

విజయలాడ,జూన్ 25: దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి చారిటీస్ భవనంలోని ఏసీ డార్మిటరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దేవస్థానం ప్రతిష్ఠతను గంగలో కలిపారంటూ సోమవారం అధికారులపై భక్తులు నిప్పులు చెరుగుతున్నారు. సీవీ రెడ్డి చారిటీస్ భవనంలో ప్రత్యేకంగా మహిళలు, పురుషుల కోసం ఒక్కో గదిలో ఆరేసి బెడ్లు ఏర్పాటు చేశారు. రెండు ఏసీ డార్మిటరీల్లో సీసీ కెమెరాలు బిగించారు.

06/26/2018 - 00:23

ఖమ్మం, జూన్ 25: గిరిజనులకు వారి మాతృ భాషలోనే విద్యాబోధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తిరిగి కసరత్తు ప్రారంభించింది. గతంలో గిరిజనులకు వారి మాతృ భాషలోనే చదువు చెప్పేందుకు ఏర్పాటు చేసిన కోయ భారతి పథకం మరుగున పడింది. ఉమ్మడి రాష్ట్రంలో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు భద్రాచలం చేరుకుని ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

06/26/2018 - 00:20

విశాఖపట్నం, జూన్ 25: ఉత్తరాంధ్రలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పం.. ఉభయగోదావరి జిల్లాల తరహాలో ఉత్తరాంధ్రను అన్నపూర్ణగా మార్చాలన్న ఆశయంతో రూపకల్పన చేసిన బాబూ జగ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం నేడు దిక్కూ మొక్కూ లేని దయనీయ స్థితిలో ఉంది.

06/26/2018 - 00:17

మామిడికుదురు, జూన్ 25: ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రాలైన మక్కా, మదీనా, కర్బలా తీర్థయాత్రలకు పంపిస్తామంటూ కెఎస్‌ఎస్ ట్రావెల్ ఏజన్సీ పేదలకు తీవ్ర అన్యాయం చేసిందని ఉమ్రా బాధితులు విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తమ గోడు వినిపించారు.

06/26/2018 - 00:12

విజయవాడ, జూన్ 25: నూటికి 95 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండే విధంగా గ్రామాల్లో రెవెన్యూశాఖ పని చేయాలని, ఆ విధంగా పని చేయడమే తనకు ఇచ్చే ఆత్మీయ సత్కారంగా భావిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రెవెన్యూ

06/26/2018 - 00:09

విజయవాడ, జూన్ 25: ఢిల్లీ దిగివచ్చేలా, కడప ఉక్కు కర్మాగారం సాధించేలా ఆందోళన ఉద్ధృతం చేయాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ రవి చేపట్టిన నిరాహార దీక్షపై సోమవారం టెలీ కాన్ఫరెన్సులో జిల్లా నేతలతో మాట్లాడారు.

06/26/2018 - 00:06

హైదరాబాద్, జూన్ 25: అందనంత ఎత్తులో ఇద్దరు విద్యార్థులు తెలంగాణ గౌరవాన్ని నిలిపి అందరి మన్ననలు పొందారు. అందులో ఏడేళ్ల సామాన్యు పోతురాజు ఒకరు కాగా, ఇంకొకరు అజ్మీరా బాబీ.

06/25/2018 - 16:30

హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలలకు 400 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 175 జూనియర్ లెక్చరర్స్, 100 టీజీటీ, 50 పీజీటీ, 50 లైబ్రేరియన్స్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ త్వరలోనే జరగనుంది. ఈ పోస్టుల భర్తీ గురుకుల నియామక బోర్డు ద్వారా జరగనుంది.

06/25/2018 - 12:38

విజయవాడ: బీజేపీ నేతలకు తమని విమర్శించే హక్కు లేదని, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరానికి కేంద్రం నుంచి రూ.1,935 కోట్లు రావల్సి ఉందని తెలిపారు. పోలవరానికి చెందిన అన్ని అంశాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

Pages