S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/25/2018 - 00:51

మామిడికుదురు, జూన్ 24: వైసీపీ అధికారంలోకి రాగానే మహిళల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని, అదే విధంగా ప్రస్తుత ప్రతిపక్ష హోదాలో కూడా మహిళల సమస్యలపై గళమెత్తిందని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

06/25/2018 - 00:29

అమరావతి, జూన్ 24: రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఇంటినీ ఇకపై ఎల్‌ఈడీ వెలుగులతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా గ్రామాల్లో ప్రతి మూడిళ్లకు ఒక ఎల్‌ఈడీ వీధిదీపాన్ని వంద అడుగుల దూరంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెండోదశలో 10లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు పంపిణీ చేయాలని నిర్దేశించారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచటంలో ఎల్‌ఈడీ కీలక పాత్ర వహిస్తుందన్నారు.

06/25/2018 - 00:26

నల్లగొండ/వలిగొండ, జూన్ 24: వాళ్లంతా దినసరి కూలీలు... అందులోనూ వ్యవసాయ కూలీలు... ఆదివారం అందరికీ సెలవే అయనా కూలీకెళ్తేనే వారికి నాలుగు మెతుకులు దొరికేది. మృత్యువు ఏ రూపంలో ముంచుకొ స్తుందో అందరిలాగానే వారికీ తెలీదు. కూలీపని దొరికింద నే ఆనందంతో ఆ శ్రమజీవులంతా ట్రాక్టర్‌లో బయలు దేరారు. అంతలోనే అనుకోని విషాదం. ఊహించని ప్రమాదం. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పల్టీకొట్టి మూసీ కాలువలో బోర్లాపడిపోయంది.

06/24/2018 - 05:40

విశాఖపట్నం, జూన్ 23: మలబార్ -18 ఎక్సర్‌సైజ్ ముగించుకుని ఇండోనేషియాకు తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ) యుద్ధ నౌకలు పయనమయ్యాయి. ఈఎన్‌సీకి చెందిన ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ కమోర్తా ఇండోనేషియాలోని మకస్సర్ పోర్టుకు చేరుకున్నాయి. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా భారత నౌకాదళం వివిధ దేశాల నౌకాదళాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది.

06/24/2018 - 05:27

హైదరాబాద్, జూన్ 23: శాంతియుత జీవనమే పురోభివృద్ధికి మార్గమని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ యువజన విభాగం చేపట్టిన భారతదేశ ప్రచార బస్సు యాత్ర (మొబైల్ ఎగ్జిబిషన్) హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శనివారం మాట్లాడుతూ దేశం కోసం యువత ముందుండాలన్నారు. 2017లో వౌంట్ అబూలో ప్రారంభమైన బస్సు యాత్ర శనివారం హైదరాబాద్ చేరింది.

06/24/2018 - 05:26

రాజోలు, జూన్ 23: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు శనివారం ఉదయం కురిసిన వర్షం ఆటంకం సృష్టించింది. దీంతో ఆయన పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన వేదాది మంది కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన జగన్ రాజోలులోని చింతపల్లి శిబిరంలో బసచేసారు.

06/24/2018 - 06:24

హైదరాబాద్, జూన్ 23: బడుగు, బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేకే కాంగ్రెస్‌ను వీడినట్టు మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం నగరంలో ఇక్కడ మొదటి సారి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, బలహీన వర్గాలకు చెందిన నేతగా తమ సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయన్ని సరిచేయాలని ఎంతో ప్రయత్నించానని అన్నారు.

06/24/2018 - 05:16

హైదరాబాద్, జూన్ 23: ఇంజనీరింగ్ కాలేజీల్లో యూజీ, పీజీ సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయించినట్టే మెరిట్ ఆధారంగానే యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలోనూ భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. పలుకుబడి ఉన్న కాలేజీలు రూల్స్‌ను తోసిరాజని ఇష్టారాజ్యంగా సీట్లను భర్తీ చేస్తున్నా, పట్టించుకునే నాధుడే లేడు.

06/24/2018 - 06:17

సీఎం రారు.. మంత్రులు ఉండరు ప్రగతిభవన్ వైపు ఉన్నతాధికారుల పరుగు

06/24/2018 - 05:12

హైదరాబాద్, జూన్ 23: ఇంజనీరింగ్ కాలేజీల్లో యూజీ, పీజీ సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయించినట్టే మెరిట్ ఆధారంగానే యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలోనూ భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. పలుకుబడి ఉన్న కాలేజీలు రూల్స్‌ను తోసిరాజని ఇష్టారాజ్యంగా సీట్లను భర్తీ చేస్తున్నా, పట్టించుకునే నాధుడే లేడు.

Pages