S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/08/2018 - 02:19

పివి రమణారావు
-----------------------

06/08/2018 - 02:16

హైదరాబాద్, జూన్ 7: పోలీసు ఉద్యోగాల్లో చేరేవారికి వయోపరిమితి పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఈ మేరకు పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితిన మరో మూడేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సడలింపు గత నెల 31న తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొన్న మూడు కేటగిరీలకు వర్తిస్తుంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

06/08/2018 - 02:15

హైదరాబాద్, జూన్ 7: గత ప్రభుత్వాల హయాంలో 60 ఏళ్లలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే తాము ఐదేళ్ల పాలనలోనే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నాలుగేళ్ల వ్యవధిలో పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, వచ్చే ఏడాది మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు.

06/08/2018 - 02:14

హైదరాబాద్, జూన్ 7: సమ్మెకు దిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, యూనియన్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఎస్‌ఆర్టీసి సమ్మెపై తీవ్రంగా స్పందించారు. సమ్మెకు అంటూ పోతే ఆర్టీసిలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఈ నెల 11 నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసి గుర్తింపు కార్మిక సంఘం టిఎంయు, మిగిలిన కార్మిక సంఘాలు ప్రకటించడంతో సమ్మె నిర్వహణకు సన్నాహక ప్రక్రియ ప్రారంభమైంది.

06/08/2018 - 04:25

మదనపల్లె, జూన్ 7:ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్నపాదాల సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసంచేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై నిప్పులు చెరిగారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా నవోదయ విద్యాలయ ప్రాంగణంలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. వర్షం పడుతున్నా కదలకుండా వేలాది మంది జనం ఆయన ప్రసంగం విన్నారు.

06/08/2018 - 04:26

విజయవాడ, జూన్ 7: ప్రపంచ దేశాలే అబ్బురపోయేలా రాష్ట్ర రాజధాని అమరావతి నగరాన్ని నిర్ణీత కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తామని సింగపూర్ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్పష్టమైన హామీనిచ్చారు.

06/08/2018 - 04:28

పాడేరు, జూన్ 7: రాష్ట్రంలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూ సేకరణ చట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విశాఖ జిల్లా పాడేరులో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రం అమలులోకి తెచ్చిన నూతన భూ సేకరణ చట్టం ప్రకారం ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకునే అవకాశం ఉందన్నారు.

06/07/2018 - 17:09

మచిలీపట్నం: బందరు ఓగీసుపేటలోని మురుగు కాల్వలో ప్రమాదవశాత్తూ పడి స్థానిక వెండి వ్యాపారస్తుడు ఖాజా తనయుడు అంజత్ ఖాన్‌ మూడేళ్ళ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటనతో కొత్తమసీదు సెంటర్లో విషాదఛాయలు అలముకున్నాయి.

06/07/2018 - 16:44

హైదరాబాద్‌: 2019లో అధికారంలోకి వస్తామనుకోవడం కాంగ్రెస్‌కు కలగా, ఓ భ్రమగానే ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. గురువారం ఆయన సచివాలయంలో ఉపాధ్యాయ బదిలీలపై రూపొందించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతి కోసం నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం పరిణితితో వ్యవహరించాలని సూచించారు.

06/07/2018 - 16:41

పాడేరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాడేరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూకపోవడం దారుణమని ఆరోపించారు. హుకుంపేట మండలం గూడలో మైనింగ్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.

Pages