S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/25/2018 - 03:18

విజయవాడ, మే 24: నాలుగు ప్రధాన డిమాండ్లపై ఈ నెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా జాతీయ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల్లో పనిచేస్తున్న 10 లక్షల మంది అధికారులు, ఉద్యోగులు 48 గంటల సమ్మెకు సన్నద్ధమవుతున్నారు.

05/25/2018 - 02:18

హైదరాబాద్, మే 24: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు గురువారం నాడు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ షెడ్యూలు విడుదల చేశారు. 25 నుండి కౌనె్సలింగ్ షెడ్యూలు మొదలవుతుంది. 8న సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆన్‌లైన్ డాటా ఇవ్వడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌కు 25వ తేదీ నుండి జూన్ 2 వరకూ అనుమతి ఇస్తారు.

05/25/2018 - 01:42

హైదరాబాద్, మే 24: వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ అనంతరం కేంద్రంలో ప్రధాన మంత్రిని నిర్ణయించేది, అక్కడ చ క్రం తిప్పేది టీడీపీయేనని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గు రువారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్మాటు చేసిన టీటీడీపీ మహానాడు సభ కు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు ప్రజల కు నమ్మక ద్రోహం చేసిందన్నారు. తీవ్రం గా దుయ్యబట్టారు.

05/25/2018 - 01:40

హైదరాబాద్, మే 24: తమకు గన్‌మెన్లను వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పుకు అనుగుణంగా తమకు గన్‌మెన్లను ఏర్పాటు చేయాలని కోరారు.

05/25/2018 - 00:52

హైదరాబాద్, మే 24: నవకల్పనలకు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ పరిష్కారాల అభివృద్ధికి, పారిశ్రామిక ప్రవర్థమానానికి, పారిశ్రామిక ఔత్సాహికతను ప్రోత్సహించేందుకు జెఎన్‌టియు జెహబ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు జెఎన్‌టియు హైదరాబాద్, హైసియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

05/25/2018 - 00:48

హైదరాబాద్, మే 24: పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ట్రస్టులకు ఆస్తి పన్ను నుంచి మినహాయించబోతున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. త్వరలోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు చెప్పారు.

05/25/2018 - 00:46

హైదరాబాద్, మే 24: రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ల విభజన, కొత్త జోన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రభుత్వ విధాన నిర్ణయంపై ప్రకటన చేశారు.

05/25/2018 - 02:55

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్ధిక శాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూలును కూడా విడుదల చేసింది. ఆన్‌లైన్ కౌనె్సలింగ్ ద్వారా మే 25 నుండి జూన్ 15 మధ్య ఉద్యోగుల సాధారణ బదిలీలు జరుగుతాయి. జూన్ 16 నుండి సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అములోకి వస్తుంది. బదిలీల శాతాన్ని 40కు పెంచారు.

05/25/2018 - 04:20

విజయవాడ, మే 24: కేంద్రం సహకరించకపోయినా, అభివృద్ధి సాధించామని, కేంద్రం అండదండలు ఉండి ఉంటే మరింత పురోగతి సాధ్యమయ్యేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో నవ నిర్మాణ దీక్ష ఏర్పాట్లపై గురువారం ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం సమంజసం కాదని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఏ విధంగా వేడుకలు జరుపుకుంటాం?

05/25/2018 - 00:29

కాకినాడ, మే 24: తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం గురువారం రసాభాసగా మారింది. సమావేశంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైసీపీకి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మధ్య ఇసుక వ్యవహారంపై తీవ్రస్థాయి వాగ్యుద్ధం జరిగింది. ఒక దశలో సంయమనం కోల్పోయిన డిప్యూటీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారు.

Pages