S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/24/2018 - 05:05

హైదరాబాద్, మే 23: భూరికార్డుల ప్రక్షాళనకు వంద రోజుల వ్యవధి ఇచ్చినా కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలు ఉండటం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేసారు. కేవలం సాంకేతిక కారణాలు ఒక్కటే కాదు మానవ తప్పిదాలు కూడా జరిగాయని ఆయన అసహనం వ్యక్తం చేసారు. దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలగటంతో పాటు కొందరికి పాసు పుస్తకాలు అందలేదన్నారు.

05/24/2018 - 02:03

హైదరాబాద్, మే 23: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల నిబంధనలు, షెడ్యూలు ఖరారుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. జీవో 12లో స్వల్ప మార్పులతో అమలుకు అంగీకరించారు. సంఘాలు సూచించిన సవరణలతో ముసాయిదాను రూపొందించే పనిని కమిషనర్‌కు అప్పగించారు.

05/23/2018 - 05:00

హైదరాబాద్, మే 22: నాలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందిస్తున్న కృష్ణానది పునర్జీవనానికి తొలి అడుగు పడింది. కబ్జాలు, కాలుష్యాకారకాలతో నిండిపోతున్న కృష్ణానదిని సజీవంగా ఉంచుకుందాం అనే నినాదంతో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ, నేషనల్ వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలో ‘కృష్ణానది పునర్జీవనం’ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు.

05/23/2018 - 04:39

న్యూఢిల్లీ, మే 22: కర్నాటకలో కాంగ్రెస్- జేడీ(ఎస్) ప్రభుత్వం కడవరకూ కొనసాగడం కష్టమేనని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి జోస్యం చెప్పారు. ‘స్వార్థంతో కూడిన వారి కలయిక ఎంతోకాలం సాగదు’ అని వ్యాఖ్యానించారు. కర్నాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారని చెప్పడానికి రాష్ట్రంలో సాధించిన 104 స్థానాలే ఉదాహరణ అన్నారు. ‘వాళ్లది అపవిత్ర కలయిక.

05/23/2018 - 04:35

న్యూఢిల్లీ, మే 22: వాయు కాలుష్యం వల్ల దేశంలో అకాల మృత్యువు బారినపడే వారి సంఖ్య పెరిగింది. వాయు కాలుష్యం ప్రభావంపై ఢిల్లీ ఐఐటి సర్వే నిర్వహించింది. సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ డెవలప్‌మెంట్ (సీడ్) సహకారంతో ‘మీ శ్వాస గురించి తెలుసుకోండి’ అనే కానె్సప్ట్‌పై ఢిల్లీ ఐఐటి విద్యార్థులు సర్వే నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్కాండ్ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది.

05/23/2018 - 02:58

ఖమ్మం, మే 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కేంద్రం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపనున్నది. వారిని నిలువరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ బ్లాక్‌పాంథర్ బలగాలను ఏర్పాటు చేసి పంపాలని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

05/23/2018 - 02:55

తిరుపతి, మే 22: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం నాడు కొనసాగుతోంది. సర్వదర్శనానికి 50గంటల సమయం పడుతోంది. కాగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 2.82కోట్లు ఆదాయం లభించింది. అలాగే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు 24.30లక్షల రూపాయలు భక్తులు విరాళంగా ఇచ్చారు. కాగా సాయంత్రం ఏడుగంటల వరకు 54,140మంది స్వామివారిని దర్శించుకున్నారు.

05/23/2018 - 02:52

న్యూఢిల్లీ, మే 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా లోక్‌సభ సభ్యత్వాలకు ఐదుగురు వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నెలాఖరుకు ఆమోదించవచ్చు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయ్యే లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవు.

05/23/2018 - 03:43

కోజికోడ్ (కేరళ), మే 22: దక్షిణాది రాష్ట్రం కేరళను నిపా వైరస్ వణికిస్తోంది. రాష్ట్రంలోని కోజిక్కోడ్, మలప్పురం జిల్లాల్లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 10 మంది మరణించారు. చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ మంగళవారం వెల్లడించారు. ఈ సరికొత్త వైరస్ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ)కు తెలియపరచినట్లు ఆమె విలేఖరులకు చెప్పారు.

05/23/2018 - 02:44

శ్రీశైలం జలాశయంలో 28 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మంగళవారం సాయంత్రం జలాశయం నీటిమట్టం 799.90 అడుగులకు చేరుకుంది. 28.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు 70 మెగావాట్ల సామర్థ్యంతో ఒక జనరేటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం జలాశయం నుండి 3,999 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

Pages