S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/20/2016 - 16:41

హైదరాబాద్ : హెచ్‌యూసీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయలతో పాటు వీసీపై చర్య తీసుకోవాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. హెచ్‌యూసీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, మిగిలిన విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

01/20/2016 - 16:40

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ మృతిపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఒత్తిడితో వీసీ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయ, వీసీ అప్పారావులే విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమని ఆయన అన్నారు.

01/20/2016 - 13:24

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై రెండవ రోజున రాంనగర్‌లోని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఈ ఉదయం ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు దత్తాత్రేయ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

01/20/2016 - 13:18

హైదరాబాద్: బంజారా హిల్స్ రోడ్ నంబరు 12లోని భవానీనగర్ శ్రీ కనకదుర్గా టెంపుల్ వెనుక వైపు నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం బుధవారం ఉదయం అకస్మాత్తుగా కొద్దిభాగం భూమిలోకి కుంగింది. దీంతో భవనంలో పని చేస్తున్న కూలీలు, చుట్టుపక్కల స్థానికులు భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

01/20/2016 - 13:11

బిహార్‌‌: బిహార్‌ రాష్ట్రంలో ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేబినెట్‌ అంగీకరించింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసకున్నట్లు సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు.

01/20/2016 - 17:19

నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం సరిగ్గా 9.31 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-31 (పిఎస్‌ఎల్‌వి) వాహక నౌకను ఇస్రో శాస్తవ్రేత్తలు నింగిలోకి విజయవంతంగా పంపారు. ఈ ఏడాది ఇస్రో సాధించిన ఘన విజయం ఇది అని శాస్తవ్రేత్తలు అభివర్ణించారు.

01/20/2016 - 06:37

హైదరాబాద్/ న్యూఢిల్లీ, జనవరి 19: రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మూడో రోజైన మంగళవారం కూడా విద్యార్ధుల నిరసనలతో దద్దరిల్లిపోయింది. మరో పక్క ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు, దళిత సంఘాలు ధర్నాలు, బైఠాయింపులు, వివిధ రకాల నిరసన, నిరశన కార్యక్రమాలను చేపట్టాయి.

01/20/2016 - 06:32

హైదరాబాద్, జనవరి 19: పక్షపాత వైఖరిని ప్రదర్శించడం ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పాలకులు రీసెర్చి విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు పురిగొల్పేలా వ్యవహరించారని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చారు.

01/20/2016 - 06:29

హైదరాబాద్, జనవరి 19: ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ బృందం తొలి రోజు బిజీ బిజీగా గడిపేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ చేపట్టింది. తొలి రోజే కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రపంచస్థాయి ప్రతినిధులతో సిఎం చంద్రబాబు ఏపీ ప్రమోషన్‌పై చర్చలు జరిపారు.

01/20/2016 - 06:27

విజయవాడ, జనవరి 19: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశంపై ప్రభుత్వ, శాసనసభ, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కెఎల్ యూనివర్సిటీని మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు.

Pages