S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/22/2018 - 02:06

అనంతపురం, మే 21: తిరుమల వేంకటేశ్వరస్వామి నగలు భద్రంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలకు భద్రత ఉందని అన్నారు. స్వామివారికి చెందిన నగలు అన్నీ ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతోందని

05/22/2018 - 03:49

అనంతపురం, మే 21: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ, వైకాపా కుట్రలు, కుతంత్రాలను ఇకపై సాగనీకుండా చిత్తుగా ఓడించి పుట్టగతులు లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

05/22/2018 - 01:58

ఏలూరు, మే 21: అవినీతిపై చంద్రబాబు శిక్షణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా రెచ్చిపోతున్నారని వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలోని మార్కెట్ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు.

05/21/2018 - 17:13

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం కీసీఆర్ ఇచ్చిన తన హామీని నిలబెట్టుకోవాలని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు అన్నారు. సోమవారంనాడు టీఎస్ ఆర్టీసీ సంఘాలు, జేఏసీ నేతలతో జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2011 నుంచి ఆర్టీసీలో నియామకాలే లేవని అన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని అన్నారు.

05/21/2018 - 16:20

హైదరాబాద్: ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని, యద్దనపూడి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. యద్దనపూడి మృతి తీరని లోటంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

05/21/2018 - 13:57

అనంతపురం: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఇందులో భాగంగా తురగలపట్నం చెరువులో జలహారతి ఇచ్చి, పూడికతీత పనులను ప్రారంభించారు. జేసీబీతో మట్టిని తీశారు. అనంతరం తురగలపట్నంలో ఎస్సీ కాలనీలో రూ. 2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే లబ్దిదారులు నిర్మించుకున్న ఎన్టీఆర్‌ గృహాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

05/21/2018 - 12:42

గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట వద్ద మంగళగిరి వైపు వెళుతున్న బైక్‌ను వెనుకనుంచి వచ్చిన ఇసుకలారీ ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న భార్యాభర్తలు కమ్మతోట శ్రీకాంత్, సరిత, వారి ఏడాది కుమార్తె అక్షర అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

05/21/2018 - 12:18

హైదరాబాద్: ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశారు.ఈ విషయాన్ని వారి కుమార్తె శైలజ తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి. ఆమె రాసిన అనేక నవలలు.. సినిమాలు, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి.

05/21/2018 - 04:13

హైదరాబాద్, మే 20: రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయినా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. రెండు రాష్ట్రాలు ప్రత్యేక ఆర్టీసీలను ఏర్పాటు చేసుకుని ఎవరి పాలన వారు నిర్వహించుకుంటున్నా విభజనతో ఏర్పడ్డ సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి.

05/21/2018 - 04:11

హైదరాబాద్, మే 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి టీడీపీలో కలుపుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు నీతులు వల్లించడం విస్మయం కలిగిస్తున్నదని బీజేపీ జా తీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యా ఖ్యానించారు. కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చే యబోయే ప్రభుత్వం అనైతికం అవుతుందని దత్తాత్రేయ ఆదివా రం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

Pages