S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/09/2019 - 04:16

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేసిన తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఐదు నిమిషాల ముందే రాజ్‌భవన్ చేరారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా కేసీఆర్ ముందే వచ్చారు.

09/09/2019 - 04:15

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చుతున్న దక్షిణ మధ్య రైల్వే టైమ్ టేబుల్స్‌ను చూసి ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. టైమ్ టేబుల్స్‌లోని తప్పులు గుర్తించి, రోజూ రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.

09/09/2019 - 04:04

చిత్రాలు.. తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్న హరీశ్ రావు, కే. తారక రామారావు, సబితా ఇంద్రా రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్.

09/09/2019 - 00:49

హైదరాబాద్, సెప్టెంబర్ 8: డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఆదివారం ఉదయం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ లాన్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికనుండి ఉదయం 11 గంటలకు పదవీ ప్రమాణం చేశారు. 11 గంటలకు ఒక నిమిషం ముందు తమిళిసై వేదికపైకి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వేదికపై ఆసీనులయ్యారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు జాతీయ గీతంలో కార్యక్రమం ప్రారంభమైంది.

09/07/2019 - 23:48

తిరుపతి, సెప్టెంబర్ 7: తిరుమలలో వసతి, దర్శనం టిక్కెట్ల కేటాయింపు కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటుచేసి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

09/06/2019 - 22:00

ఐరాల, సెప్టెంబర్ 6: శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శేష వాహనంపై గణనాథుడు విహరించారు. కార్యక్రమానికి కాణిపాకం, కాకర్లవారిపల్లి, వడ్రంపల్లి, మిట్టఇండ్లు, కొత్తపల్లి, అడపగుండ్లపల్లి, బొమ్మసముద్రం, తిమ్మోజపల్లి, తిరువణంపల్లి, చిగరపల్లిలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

09/06/2019 - 21:56

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 6: యాదాద్రి ప్రధానాలయం పునర్నిర్మాణంలోని అష్ట్భుజ ప్రాకార మండప రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రం, టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తు, కేసీఆర్ కిట్ పథకం చిహ్నం, హరితహారం చిహ్నాలు, జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చిత్రపటాలు, అలాగే ముస్లిం సంస్కృతిలో భాగమైన పీర్లను, చార్మినార్‌ను కూడా చెక్కడం వివాదాస్పదమైంది.

09/06/2019 - 04:51

చిత్రం...ప్రగతి భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో
చేర్చడంపై కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

09/06/2019 - 04:42

హైదరాబాద్, సెప్టెంబర్ 5: దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు ఉన్న ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళే ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారిమళ్లించారు. పరిస్థితి చక్కబడేవరకు రైళ్లను పునురుద్ధరించలేమని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు 19 రైళ్లపై రద్దు ప్రభావం చూపుతోంది.

09/06/2019 - 03:45

రావులపాలెం, సెప్టెంబర్ 5: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో జేబు దొంగలు హస్తలాఘవం ప్రదర్శించారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో సాక్షాత్తూ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జేబులోని రూ.లక్ష నగదు కాజేశారు. వివరాల్లోకి వెళితే...

Pages