S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/14/2018 - 04:19

విశాఖపట్నం, మే 13: ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను అభివృద్ధి చేస్తామన్న ప్రకటనలు ప్రచారానికే పరిమితమవుతున్నాయి. హెలీ టూరిజం, రిసార్ట్స్, బౌద్ధరామాలు అభివృద్ధిపర్చడంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు పర్యాటకాన్ని అనుసంధానించడం వంటివి ఏళ్ళు గడుస్తున్నా సాధ్యపడటంలేదు. ప్రధానంగా హెలీ టూరిజంపైనే పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టిసారించింది.

05/14/2018 - 05:02

హైదరాబాద్, మే 13: కొత్తగా ఏదైనా సినిమా విడుదలైతే అది విజయవంతమైందా? లేదా? అన్న విషయం ప్రేక్షకుల ఆదరణను బట్టి స్పష్టమవుతోంది. అలాగే ప్రభుత్వాలు చేపట్టే వివిధ పథకాలు, కార్యక్రమాల ప్రభావం ప్రజల్లో ఏవిధంగా ఉంటుందో ప్రజాభిప్రాయం వెల్లడిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం తాజాగా చేపట్టిన ‘రైతు బంధు’ పథకం గ్రామీణ ప్రాంతా ల్లో ప్రస్తుతం ప్రధానమైన చర్చగా మారింది.

05/14/2018 - 05:04

హైదరాబాద్, మే 13: చిన్న చిన్న తప్పులకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం, వేధింపులకు గురి చేయడం ప్యూడల్ మనస్థతత్వం. ఇలాంటి అనాగరిక చర్యలకు స్వస్తి పలకాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని మంత్రివర్గ ఉప సంఘం మందలించింది. ఆర్టీసికి ఆదాయం పెరగడం ఒక్కటే కాదు, కార్మికుల సంక్షేమం కూడా ప్రభుత్వానికి ముఖ్యమని ఉప సంఘం హితవు పలికింది.

05/14/2018 - 03:59

హైదరాబాద్, మే 13: ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సకాలంలో వస్తాయా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మే20 లేదా ఒకటి రెండు రోజులు అటూఇటుగా అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఇవి ప్రారంభమవుతాయి. నైరుతీ రుతుపవనాలు ప్రారంభమయ్యే తేదీ గురించి భారత వాతావరణ శాఖ (ఐఎండి) సుమారు పదిరోజుల ముందే ప్రకటించేది. ఈ ఏడాది ఇప్పటి వరకు అలాంటి బులెటిన్ విడుదల కాలేదు.

05/14/2018 - 05:07

గుంటూరు, మే 13: నాలుగేళ్లుగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విషబీజాలు నాటిందని, ఇకపై ఆ పార్టీతో ప్రచ్ఛన్న యుద్ధం తప్పదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు.

05/14/2018 - 02:51

కర్నూలు, మే 13: స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో పూర్తి చేయడానికే ప్రభుత్వం సిద్ధపడుతోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆగస్టులో పూర్తిచేసి ప్రజా నాడిని పసిగడితే, సార్వత్రిక ఎన్నికల నాటికి తప్పొప్పులు సరిదిద్దుకునే చాన్స్ ఉంటుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

05/14/2018 - 02:49

* విశాఖ, విజయనగరంలోనూ బీభత్సం * విశాఖలో 6 సెంమీ వర్షపాతం నమోదు
* ఒడిశా ఎగువప్రాంతంలో ద్రోణి ప్రభావం

05/13/2018 - 04:13

విజయవాడ, మే 12: ముస్లిం సమాజాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముస్లిం సమాజం కోసం మూడు హజ్ హౌస్‌లు నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ విద్యాధరపురంలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న హజ్ హౌస్‌కు శనివారం రాత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

05/13/2018 - 02:32

హైదరాబాద్, మే 12: కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి శనివారం జరిగిన విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అనుకూల వాతావరణం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. వివిధ ఛానళ్ళు, సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారమే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయా? అనేది ఈ నెల 15న ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది.

05/13/2018 - 02:31

హైదరాబాద్, మే 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇందిరమ్ల ఇళ్ల నిర్మాణం కుంభకోణంపై ప్రభుత్వం దృష్టిసారించింది. లెక్కలేనన్ని అక్రమాలు జరిగినట్లు శాఖాపరమైన విచారణలో తేలడంతో ఇప్పటికే ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Pages