S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/12/2018 - 13:16

రంగారెడ్డి: జిల్లాలోని పెద్దఅంబర్‌పేట లకా్ష్మరెడ్డిపాలెం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉరివేసుకుని దంపతులు సృజన్‌రెడ్డి(45), సారిక(40)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

05/12/2018 - 13:13

తిరుపతి: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి నగర శాసనసభ్యురాలు సుగుణమ్మ అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు తెదేపా కార్యకర్తలను విడుదల చేశారు.

05/12/2018 - 06:14

హైదరాబాద్, మే 11: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుండి నిర్వహించనున్నట్టు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఇందుకోసం 819 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4,20,549 మంది పరీక్ష రాయబోతున్నారని అన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు బోర్డు కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏదైనా అనుమానాలుంటే 040-24601010/24732369 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

05/12/2018 - 04:59

హైదరాబాద్, మే 11: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వరంగల్, విజయవాడ మీదుగా నడిచే వారానికి ఒకసారి నడిచే కొత్త హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి ఈ రైలు ప్రారంభమవుతుండగా, రెగ్యులర్‌గా ఈ నెల 23 నుంచి నడుస్తుందని ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

05/12/2018 - 04:45

తిరుపతి, మే 11: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆలయంలోకి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు సాదర స్వాగతం పలికి దగ్గరుండి వారికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

05/12/2018 - 02:55

హైదరాబాద్, మే 11: రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాల సామర్య పూర్వక పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు సమ్మతించాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యలను పరిష్కరించుకోవడానికి అంగీకారానికి వచ్చాయి. అయితే తమ పరిధిలో లేని అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన ఉండటంతో తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్ అధికారులు తేల్చి చెప్పారు.

05/12/2018 - 05:07

హైదరాబాద్, మే 11: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 14న జరగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం 16కు వాయిదా పడింది. ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై వారితో 14న చర్చించి ప్రభుత్వ

05/12/2018 - 05:18

విజయవాడ, మే 11: అహం పెరగడం వల్లే బీజేపీ నేతలు ప్రజలకు దూరమయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తమనే ప్రశ్నిస్తారా అనే ఆధిపత్య భావన ప్రజలకు దూరం చేస్తుందన్నారు. లాలూచీ పార్టీలతో పోరాటం ఆషామాషీ కాదని, 175 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది.

05/12/2018 - 04:57

తిరుపతి, మే 11: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి తిరుగు ప్రయాణమైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసనల సెగ తాకింది. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్న సంఘటన శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో అలిపిరి వద్ద చోటుచేసుకుంది. ఈక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో అమిత్ షా వాహనంపై తెలుగుదేశం శ్రేణులు దాడికి ప్రయత్నించాయి.

05/12/2018 - 02:34

హైదరాబాద్, మే 11: రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాల సామర్య పూర్వక పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు సమ్మతించాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యలను పరిష్కరించుకోవడానికి అంగీకారానికి వచ్చాయి. అయితే తమ పరిధిలో లేని అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన ఉండటంతో తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్ అధికారులు తేల్చి చెప్పారు.

Pages