S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/05/2018 - 12:05

అమరావతి: ఆడపిల్లలపై ఆఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయనే భయం రావాలని, ఫోక్సో చట్టంలో సవరించిన నిబంధనలపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శనివారంనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు యంత్రాంగం పనితీరునకు అభినందనలు తెలిపారు. దాచేపల్లి ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని పేర్కొన్నారు.

05/05/2018 - 12:04

గుంటూరు: దాచేపల్లి అత్యాచార బాధిత బాలికను ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారంనాడు పరామర్శించారు. స్థానిక జీజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను కోడెల పరామర్శించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ బాలికకు కావల్సింది సానుభూతి కాదని మనోధైర్యం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సకాలంలో స్పందించిందని అన్నారు.

05/05/2018 - 12:04

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో నేడు, రేపు వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వడగళ్ల వానలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దక్షిణకోస్తా, రాయలసీమలలో వర్షాలు పడతాయని, ఎల్లుండి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు.

05/05/2018 - 12:03

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ ఆర్‌ఎస్ బ్రదర్స్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు చేలరేగి వస్త్రాలన్నీ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

05/05/2018 - 02:57

హైదరాబాద్, మే 4: కార్పొరేట్ జూనియర్ కాలేజీల వివాదం కొత్త మలుపు తిరిగింది. విద్యాత్మక పరీక్షలతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షల్లో అగ్రగామిగా నిలిచిన శ్రీనారాయణ విద్యాసంస్థలు, శ్రీ చైతన్య విద్యాసంస్థల మధ్య మాటల యుద్ధం కేసుల వరకూ పోయి నేడు పతాకస్థాయికి చేరింది.

05/05/2018 - 02:34

హైదరాబాద్, మే 4: అకాల వర్షంవల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. ఇందుకోసం పాత జిల్లాలకు సంబంధించి 9మంది సీనియర్ డిసీఎస్‌ఓలను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

05/05/2018 - 03:41

హైదరాబాద్, మే 4: ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉద్యోగ సంఘాలు చేస్తోన్న 18 డిమాండ్లలో రెండు, మూడు మినహా మిగతా వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిసిన అనంతరం మంత్రివర్గ ఉప సంఘం అధ్యక్షుడు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

05/05/2018 - 03:42

హైదరాబాద్, మే 4: ‘తెలంగాణకు మళ్లీ మళ్లీ వస్తా. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటా..’నని తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అధ్యక్షతన శుక్రవారం పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో జరిగిన సర్వసభ్య సమావేవానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

05/05/2018 - 02:30

* అంబర్‌పేట- రామంతాపూర్, ఉప్పల్- బోడుప్పల్ ఫ్లై ఓవర్లు
* నర్సాపూర్- మెదక్, అరాంఘర్- శంషాబాద్ ఎలివేటెడ్ కారిడార్
* నేడు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
* వివరాలను వెల్లడించిన ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల

05/05/2018 - 03:44

గురజాల, మే 4: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన గుంటూరు జిల్లా దాచేపల్లి అత్యాచార ఘటన కేసులో నిందితుడు అన్నం సుబ్బయ్య (60) శుక్రవారం గురజాల మండలం, దైద గ్రామం సమీపంలోని అడవి లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు మూడు రోజుల క్రితం సభ్యసమాజం తలదించుకునేలా దాచేపల్లిలో రెండవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై రిక్షానడిపే అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన తెలిసిందే.

Pages