S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/05/2018 - 02:16

విశాఖపట్నం, మే 4: విశాఖలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ వివాహిత మహిళను హత్య చేసి, పెట్రోలుపోసి తగులబెట్టిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. విశాఖ నగర శివారు నరవ గ్రామంలో ఓ వివాహిత మహిళను కొంతమంది అగంతకులు హత్య చేసి పెట్రోలు పోసి తగులబెట్టారు. మార్నింగ్ వాక్‌కు వెళుతున్నవారు తగులబడుతున్న శవా న్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అగంతకులు పరారయ్యారు. వెంటనే పోలీసు జాగిలాలను రంగంలోకి దించారు.

05/05/2018 - 03:47

విజయవాడ, మే 4: సంక్షేమ పథకాల అమలులో లోపాలను తొలగించి ఉద్దేశిత ప్రయోజనాలను ప్రజలకు చేకూరేలా మరింత కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడంతో పాటు పథకాల అమలు ద్వారా ఉద్దేశించిన ప్రయోజనాలూ తమకు చేకూరుతున్నాయన్న బలమైన భావనను ప్రజల్లో పాదుగొల్పాలని..అప్పుడే ప్రభుత్వ విశ్వసనీయతకు బలం చేకూరుతుందన్నారు.

05/05/2018 - 02:13

న్యూఢిల్లీ, మే 4: న్యాయవ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య జడ్జిల నియామకం విషయంలో నెలకొన్న వివాదం ముదురుపాకాన పడుతోంది. కొలీజియం తగిన సంఖ్యలో న్యాయమూర్తుల పేర్లను సిఫార్స్ చేయడం లేదని కేంద్రం, సిఫార్స్ చేసినవారి నియామకాలనే ఇంతవరకూ ప్రభుత్వం ఖరారు చేయలేదని అత్యున్నత న్యాయస్థానం.. ఇలా పరస్పర వాదనలకు దిగడంతో పరిస్థితి ముఖాముఖి అన్న స్థాయికి చేరుకుంది.

05/05/2018 - 03:49

ఖమ్మం, మే 4: మావోయిస్టులు శుక్రవారం చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం తెల్లవారు జామున భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టును పేల్చివేయటంతో పోలీసులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. బంద్ సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నప్పటికి ప్రధాన రహదారిపైనే పేల్చివేత జరగటం గమనార్హం.

05/05/2018 - 03:50

హైదరాబాద్, మే 4: మెడికల్, డెంటల్ యుజి కోర్సులో చేరేందుకు జాతీయ స్థాయిలో ఈనెల 6న నిర్వహిస్తున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు)కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది హాజరవుతున్న పరీక్షకు ఆంధ్ర, తెలంగాణ నుంచి 2.5 లక్షలమంది హాజరవుతున్నారు. ఆంధ్రలో 9, తెలంగాణలో 4 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

05/05/2018 - 03:52

అనంతపురం, మే 4: అనంతపురం జిల్లాలో సంభవించిన ఈదురుగాలులు, వర్షానికి పండ్లతోటల రైతులు భారీగా నష్టపోయారు. గురువారం జరిగిన ఈ ప్రకృతి బీభత్సంలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 11 కోట్ల మేరకు పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని 30 మండలాల్లో అరటి, మామిడి, బొప్పాయి, నిమ్మ, వరి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది.

05/04/2018 - 17:59

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం శుక్రవారంనాడు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్‌లో జరిగింది. సమావేశానికి హజరైన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సహకరిస్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఎపుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

05/04/2018 - 17:59

దాచేపల్లి: దాచేపల్లి అత్యాచార నిందితుడు ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. అయితే సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయినా తీసుకువెళ్లేందుకు బంధువులు సైతం ముందుకు రాలేదు. కన్నకొడుకు సైతం ముందుకు రాకపోవటంతో మృతదేహాన్ని పంచాయతీకి అప్పగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

05/04/2018 - 16:10

అమరావతి: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన దురదృష్టకరమని మంత్రి పుల్లారావు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని, బాధితురాలి కుటుంబాన్ని మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయాలనుకున్నారని ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు.

05/04/2018 - 16:09

ఏలూరు:టీడీపీ ఏలూరు ఎంపీ మాగుంట బాబు శుక్రవారంనాడు సొమ్మసిల్లి పడిపోయారు. చింతలపూడిలోని సైకిల్‌యాత్రలో పాల్గొని వస్తుండగా ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను చింతలపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Pages