S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/23/2016 - 14:04

హైదరాబాద్‌: హైదరాబాద్ మేయర్ టీఆర్‌ఎస్ కైవసం కావడం ఖాయమైపోయిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, శేరిలింగంపల్లి తెదేపా నేత బండి రమేశ్‌ తదితరులు రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

01/23/2016 - 13:24

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం 15 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణభవన్‌లో ఆపార్టీ నేతలు గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కేకే, డీఎస్ తదితరులు నేతలు పాల్గొన్నారు.

01/23/2016 - 12:55

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం పాఠశాలలో ఖో..ఖో.. ఆడుతూ భద్రాచలం అనే విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఉపాధ్యాయులు భద్రాచలంను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురుగా ఢీకొనడంతో సంఘటన చోటుచేసుకున్నది.

01/23/2016 - 02:51

హైదరాబాద్, జనవరి 22: రాష్ట్రంలో వంతెనలు, టనె్నళ్ల నిర్మాణాలను 11 అంచెలుగా చేపట్టి 25 నెలల్లో పూర్తిచేస్తామని చైనా కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. వారు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో భేటీ అయ్యారు. తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో వీటిని పూర్తి చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

01/23/2016 - 01:02

విజయవాడ, జనవరి 22: ప్రతి ఏటా మూడు సీజన్లలో 120 రకాల పంటలు పండించే 33వేల ఎకరాల భూములను అదిరించి, బెదిరించి కైవసం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను విదేశీ కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోందంటూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ధ్వజమెత్తారు.

01/23/2016 - 01:01

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సెగలు అంతిమంగా శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కేంద్రమైన గాంధీ భవన్‌కు తాళం వేయడం వరకూ దారితీశాయి. టికెట్లు దక్కని నేతలు ఆత్మహత్యలు, ఆందోళనలు, ధర్నాలకు గాంధీ భవన్‌నే వేదికగా చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

01/23/2016 - 01:00

హైదరాబాద్, జనవరి 22: వర్శిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై కేంద్రం అవాస్తవాలు చెబుతోందని జెడియు పార్లమెంట్ సభ్యులు త్యాగి, పవన్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం వర్శిటీ ప్రాంగణంలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.

01/23/2016 - 00:59

హిందూపురం, జనవరి 22: సెంట్రల్ వర్శిటీకి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. రోహిత్ విద్యాభ్యాసం చేసిన పాఠశాలలు, కళాశాలలనుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కొడిగెనహళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల కళాశాలలో శుక్రవారం ఇంటెలిజెన్స్ వర్గాలు రోహిత్ వివరాలు సేకరించాయి.

01/23/2016 - 00:59

హైదరాబాద్, జనవరి 22: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ది ఏ కులమనే విషయమై చర్చలు సాగుతున్న నేపథ్యంలో తమది వడ్డెర కులమేనని అతని తండ్రి తేల్చి చెప్పారు. రోహిత్ తండ్రి మణికుమార్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. తాను దళితుడిని కాదని, బిసి ‘ఏ’ గ్రూపునకు చెందిన వాడని ఓ టివి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

01/23/2016 - 00:58

విజయవాడ (క్రైం), జనవరి 22: కల్తీ మద్యం మరణాల కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ పత్రాలు సకాలంలో జిల్లా జైలుకు చేరనందున విష్ణు విడుదల శనివారానికి వాయిదా పడింది. దీంతో పెద్ద సంఖ్యలో జైలు వద్ద తరలివచ్చిన పార్టీ కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.

Pages