S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/03/2018 - 02:54

విశాఖపట్నం, మే 2: ఎంసెట్ ఫలితాల్లో ఉత్తరాంధ్ర విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. మెడిసిన్‌లో విశాఖ విద్యార్థిని జంగాల సాయి సుప్రియ రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే జేఈఈ మెయిన్స్‌లో దేశంలో రెండో స్థానంలో నిలిచిన విశాఖకు చెందిన సీకేవీఆర్ హేమంత్ కుమార్ ఇంజనీరింగ్‌లో ఎనిమిదవ ర్యాంక్ సాధించాడు. వీరిద్దరూ విశాఖలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల్లోనే చదువుతున్నారు.

05/03/2018 - 02:53

కర్నూలు, మే 2: దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలపై నెలకొన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ ఆశలను కన్నడ ఓటర్లు నిలబెడతారా లేదా అన్నదే ప్రజల ఆసక్తికి కారణం. అయితే కర్నాటకలో అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆశలకు తెలుగు ఓటర్లు ఆటంకంగా మారారన్న చర్చ జోరుగా సాగుతోంది.

05/03/2018 - 02:49

కాకినాడ, మే 2: ఇంటర్మీడియట్ కాకుండా ఇతర బోర్డుల నుండి ఏపీ ఎంసెట్-2018 రాసిన 5497 మంది అభ్యర్ధులకు బుధవారం ర్యాంకులు కేటాయించలేదు! అభ్యర్ధుల నుండి మార్కుల జాబితాలు అందగానే వాటిని పరిశీలించిన పిమ్మట త్వరలోనే మిగిలిన వారికి ర్యాంకులు కేటాయించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు చెప్పారు.

05/03/2018 - 02:48

లక్నో, మే 2: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న మహమ్మదలీ జిన్నా ఫోటోపై వివాదం చెలరేగింది. పాక్ వ్యవస్థాపకుడైన జిన్నా ఫోటోను తొలగించాలని కొంతమంది రైట్ వింగ్ కార్యకర్తలు యూనివర్సిటీ వద్ద బుధవారం గొడవ చేయడంతో, విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తక్షణమే పోలీసులు రంగంలో దిగి రైట్‌వింగ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

05/03/2018 - 02:23

**ఆన్‌లైన్‌లో తొలిసారి నిర్వహించిన ఎమ్సెట్‌కు బుధవారం సాంకేతిక ఇబ్బందులు తప్పలేదు. కొన్నిచోట్ల పరీక్ష ఆలస్యంగా మొదలైతే, మరికొన్నిచోట్ల అభ్యర్ధుల సీట్లు మారిపోయాయ. అయితే కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య మాత్రం పరీక్ష ప్రశాంతంగా, అవాంఛనీయ సంఘటనలకు దూరంగా సాగిందని చెప్పడం గమనార్హం. తెలంగాణలో 10, ఆంధ్రలో 4 కేంద్రాల్లో మొదలైన ఎమ్సెట్ ఆన్‌లైన్ పరీక్షలకు కేంద్రాల వద్ద బారులుతీరిన విద్యార్థులు.

05/03/2018 - 02:20

హైదరాబాద్, మే 2: ‘కొంతమంది తెలిసో, తెలియకో 2019 ఎన్నికల్లో అధికారం కోసమో, పదవుల కోసమో ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్‌గా భావిస్తున్నారు. దీన్ని చిల్లర రాజకీయాల కోణంలో కాకుండా దేశ హితం కోరి చేస్తోన్న ప్రయత్నంగా చూడాలి’ అని తెరాస అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తమ ప్రయత్నాన్ని మీడియా థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌గా అభివర్ణించడం సరికాదని హితవు పలికారు. తొందర, తత్తరపాటు ఎందుకు?

05/03/2018 - 02:19

హైదరాబాద్, మే 2: కేంద్రంలో బీజేపీని నిలువరించగలిగే శక్తి ఒక్క ప్రాంతీయ పార్టీలకే ఉంది. ఆ దిశగా తెరాస అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మా పూర్తి సహకారం, మద్దతు ఉంటుంది అని సమాజ్‌వాది అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దేశ ప్రజలకు చాంతాడంత హామీలిచ్చిన బీజేపీ, ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని దుయ్యబట్టారు.

05/03/2018 - 02:16

* ముపు పొంచివుందన్న సమాచారం ప్రాజెక్టులకు భద్రత కట్టుదిట్టం
* చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ పోలీస్ అప్రమత్తం

05/03/2018 - 02:14

హైదరాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్ ఎమ్సెట్‌లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభను చాటారు. ఏపీ ఎమ్సెట్ ఫలితాలను బుధవారం ఏపీ హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకులు తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన గట్టు మైత్రేయ రెండో ర్యాంకు సాధించాడు.

05/03/2018 - 02:13

హైదరాబాద్, మే 2: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు అడ్డంకిగా మారబోతున్నాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 58 శాతం నుంచి 60 శాతం వరకు చేరుతున్నాయి.

Pages