S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/03/2018 - 01:57

విజయవాడ, మే 2: చాలాకాలంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఎదురుచూస్తున్న 11వ వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 10వ పీఆర్సీ పాత బకాయిలు రూ.3,999 కోట్లను విడతల వారీగా చెల్లించేందుకు కూడా నిర్ణయించింది.

05/03/2018 - 01:55

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 2: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు-2018 విడుదలయ్యాయి. ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విజయవాడలోని హోటల్ డివి మానర్‌లో విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 72.28 శాతం ఉత్తీర్ణత సాధించగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన భోగి సూరజ్‌కృష్ణ 95.2720 స్కోర్‌తో ప్రథమర్యాంక్ సాధించాడు.

05/03/2018 - 01:49

హైదరాబాద్, మే 2: కేంద్రంలో బీజేపీని నిలువరించగలిగే శక్తి ఒక ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంది. ఆ దిశగా దేశగా టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దేశ ప్రజలకు బిజేపి ఇచ్చిన హామీల జాబితా చాతడంతా ఉన్నప్పటికీ ఏ ఒక్క హమీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.

05/02/2018 - 05:20

హైదరాబాద్, ఏప్రిల్ 1: కార్మిక దినోత్సవం (మే-డే) సందర్భంగా మం గళవారం అన్ని పార్టీ కార్యాలయాల్లో నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ ఆవరణలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ప్రకాశం హాలులో సభ నిర్వహించారు.

05/02/2018 - 05:19

హైదరాబాద్, మే 1: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో 92.21 శాతం ఉత్తీర్ణులయ్యారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ప్రవేశపరీక్షలో ఏడుగురికి సమాన మార్కులు రావడంతో ఏడుగురికి తొలి ర్యాంకును ఇచ్చారు. మరో తొమ్మిది మందికి తర్వాతి స్థానంలో సమా న మార్కులు రావడంతో వారందరికీ 8వ ర్యాంకు కేటాయించారు.

05/02/2018 - 04:30

తిరుపతి, మే 1: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన అధికారులతో కలసి తిరుమలలోని ప్రధాన కల్యాణకట్ట, నందకం అతిధి భవనంలోని మినీ కల్యాణ కట్టలు, నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లను తనిఖీ చేశారు.

05/02/2018 - 04:28

విజయవాడ, మే 1: తొలిదశలో 28 గ్రామాలను మోడల్ స్మార్ట్ విలేజెస్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన స్మార్ట్ విలేజెస్ ఫౌండేషన్ భాగంగా స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమంలో ఆయన మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ విలేజెస్‌గా తీర్చిదిద్దాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

05/02/2018 - 03:47

* రైతు బంధు పథకం అమలుకు శరవేగంగా ఏర్పాట్లు

05/02/2018 - 02:39

హైదరాబాద్, మే 1: తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో వైద్య శాఖ ప్రయత్నాలు ఫలితాలిచ్చాయ. సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైన్ క్లియర్ చేసింది. అలాగే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 3వ బ్యాచ్ 150 ఎంబిబిఎస్ సీట్లకు రెన్యువల్ ఇచ్చింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100 సీట్లకు రెన్యువల్ ఇచ్చింది.

05/02/2018 - 02:37

* 4న ఉద్యోగులు, గెజిటెడ్ల జేఏసీ భేటీ

Pages