S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/02/2018 - 03:50

కామారెడ్డి, మే 1: కేసీఆర్ పాలనలో గిరిజనుల భూములు లాక్కొని వారిని అణిచివేతకు గురిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎంఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన చలో కామారెడ్డి గిరిజన కాంగ్రెస్ సదస్సులో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావంతో ప్రతి తండాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన గిరిజనులు కలలు కల్లలయ్యాయన్నారు.

05/02/2018 - 02:33

హైదరాబాద్, మే 1: ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల కాలపరిమితి వచ్చే ఆగస్టుతో ముగుస్తోందన్నారు.

05/02/2018 - 03:52

* రెండు నెలల్లో ఎల్బీనగర్‌కూ పరుగులు పెట్టిస్తాం: మంత్రి కేటీఆర్

05/02/2018 - 03:55

* నెల్లూరు రవాణా శాఖ ఉద్యోగి ఇంట్లో బంగారు ఖజానా

05/02/2018 - 03:53

హైదరాబాద్, మే 1: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సన్నద్ధంగా ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మంగళవారం ప్రకటించారు. పక్కాగా రూపొందిస్తున్న ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్త్తామన్నారు. జనసేన ఆఫీసులో 13 జిల్లాలనుంచి వచ్చిన ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త దేవ్‌ను పరిచయం చేశారు.

05/02/2018 - 03:56

* చంద్రన్న బీమా కార్మిక కుటుంబానికి శ్రీరామరక్ష * మేడే వేడుకల్లో స్పష్టం చేసిన సీఎం

05/02/2018 - 04:03

మచిలీపట్నం, మే 1: భగవంతుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో తాను అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతానని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా 150వ రోజైన మంగళవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జగన్ పాదయాత్ర చేశారు.

05/02/2018 - 01:58

రాజమహేంద్రవరం, మే 1: రాష్ట్రానికే జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం నిధుల కోసం ఎదురుచూస్తోంది. వారం వారం ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నా, ప్రతీ నెలా క్షేత్రస్థాయిలో పర్యటించడం తదితరాలతో ఎప్పటికప్పుడు పనులను పరుగెత్తిస్తున్నా, నిధుల మంజూరు విషయంలో అనుకున్నంత వేగం కనిపించడంలేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం మంజూరుచేయాల్సివుంది.

05/01/2018 - 15:36

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వ‌ర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మే డే సందర్భంగా మంత్రులు పార్టీ జెండా ఎగురవేశారు. కార్మిక సోదరులకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, మేయర్ రామ్మోహన్, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు హాజరయ్యారు.

05/01/2018 - 15:21

నెల్లూరు :నెల్లూరు జిల్లా రవాణా శాఖ ఉద్యోగి నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారెడ్డి ఉప రవాణా శాఖ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్న వివరాల ప్రకారం.. రూ.80కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది.

Pages