S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/01/2018 - 15:14

విజయవాడ: చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాటం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే వైకాపా నయవంచన దీక్ష చేపట్టిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలు పెరిగిన తరువాత నిమ్మకూరు ఏ జిల్లాలోకి వస్తే ఆజిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టాలని ఎపుడో నిర్ణయించామని తెలిపారు.

05/01/2018 - 15:12

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఉప్పల్‌లోని ఓ కార్యక్రమానికి వెళుతుండగా మంత్రి కాన్వాయ్‌లోని ఎంపీ మల్లారెడ్డి కారు ఢీకొని యువకునికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

05/01/2018 - 15:10

హైదరాబాద్: దేశంలో బీజేపీని ఓడించే దిశగా పొత్తులు ఉంటాయని సిపిఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కేరళలో జరిగిన సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటుకు సీపీఐ ప్రయత్నిస్తుందని చెప్పారు. తెలంగాణ జన సమితితో పనిచేసే అవకాశం ఉందని అన్నారు.

05/01/2018 - 13:21

సిద్ధిపేట: ఈనెల 10 నుంచి 17 వరకు రైతు బంధు పథకం అమలు జరుగనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం జిల్లాలోని రెడ్డిసంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన రైతుబంధు, పాస్ బుక్కుల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రైతుబందు పథకం ద్వారా చెక్కులు ఇవ్వబోతున్నామని చెప్పారు.

05/01/2018 - 11:59

కృష్ణా: వైకాపా అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం గూడూరు మండలం పర్ణశాల నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. రామరాజుపాలెం క్రాస్‌ మీదుగా మచిలీపట్నం వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు.

05/01/2018 - 11:56

విజయనగరం: జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. భోగాపురం మండలం పెద్దకొండరాజుపాలెం వద్ద సముద్ర తీరం పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా బలమైన ఈదురుగాలులకు సముద్రంలో గల్లంతైన బొందు చిన్న అమ్ములు(30) స్థానికులు గాలిస్తున్నారు.

05/01/2018 - 11:55

విజయనగరం : ఉత్తరాంధ్ర జిల్లాలలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, ఆముదాలవలస, శ్రీకాకుళంలో వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, బొబ్బిలిపట్టణాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షం పడుతోంది.

05/01/2018 - 11:49

మేడ్చల్ : హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామని, నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్‌ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ.

05/01/2018 - 11:46

కరీంనగర్ : జిల్లాలోని కేశవపట్నంలో అనుమానాస్పదస్థితిలోదంపతులు మృతి చెందారు. భార్య ధనలక్ష్మిని భర్త గొడ్డలితో నరికి చంపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య హత్య అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

05/01/2018 - 05:29

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరుగుతాయా? కొద్దికాలంగా రాష్ట్రంలో చర్చనీయాంశ అంశమిది. నిజానికి టెర్మ్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే ఆలోచనవుంటే, ఈ పాటికి ఎన్నికల ఏర్పాట్లు, హడావుడి కనిపించి ఉండేది. కాని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావుడి ఇప్పటి వరకు లేకపోవడంతో ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? అన్న అనుమానం బలపడుతోంది.

Pages