S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/30/2018 - 03:14

జగిత్యాల, ఏప్రిల్ 29: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే సొంతం కాదని, దృఢ సంకల్పం, లక్ష్యం ఉం టే గ్రామీణ ప్రాంతాల సామాన్యులకు కూడా సాధ్యమేనని 2017 సివిల్స్ ఆలిండియా టాపర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అనుదీప్ మాట్లాడా రు.

04/30/2018 - 02:33

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వంతో పాటు రైతుల భయానికి తెరపడ్డది. ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’ పథకానికి అవసరమైన కరెన్సీ రాష్ట్రానికి చేరుతోంది. సాధారణంగా నెలకు 500 కోట్ల నుండి 800 కోట్ల రూపాయల కరెన్సీ వచ్చే తెలంగాణకు ఈ పర్యాయం నెలరోజుల వ్యవధిలో దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఆర్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

04/30/2018 - 02:32

హైదరాబాద్, ఏప్రిల్ 29: ‘తెలంగాణకు పట్టిన నట్టలు వదిలిస్తాం’ అని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షునిగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. 2019లో అధికారంలోకి రాగానే ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో తెలంగాణ జన సభ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరిగింది.

04/30/2018 - 04:06

హైదరాబాద్: పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసిన తొలితరం నాయకుడు, మాజీ మంత్రి పి రామచంద్రారెడ్డి ఆదివారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం బాత్‌రూమ్‌లో జారిపడిన ఆయన ఎస్‌ఆర్ నగర్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామచంద్రారెడ్డి 1962లో తొలిసారి సంగారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

04/30/2018 - 02:48

విశాఖపట్నం, ఏప్రిల్ 29: పదో తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. మార్చి 15 నుంచి 29వ తేదీ వరకూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రంల్లో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు కలిపి 6,22,538 మంది మంది విద్యార్థులకు 6,13,778 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 94.48 శాతం మంది విద్యార్థులు

04/30/2018 - 02:22

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నాలుగేళ్లుగా ఖూనీచేసి ప్రజలను అన్నివిధాలా మోసం చేసి, అన్నీ ‘420’ పనులు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే హోదా కోసం ధర్మపోరాటం పేరుతో దీక్షల నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. బాబుకు ఏమాత్రం దమ్మున్నా తనకు నేరుగా సమాధానం చెప్పాలంటూ ఏడు ప్రశ్నలు సంధించారు.

04/30/2018 - 02:20

పుల్లంపేట/తాడిపత్రి, రొంపిచర్ల, ఏప్రిల్ 29 : కడప, గుంటూరు జిల్లాల్లాల్లో ఆదివారం జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో మొత్తం 11మంది దుర్మరణం చెందారు. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో కడపలో ఏడుగురు మరణించారు. గుంటూరులోని రొంపిచర్లలో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో వారంతా మరణించారు.

04/30/2018 - 02:14

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో అక్టోబర్ నాటికి ఎల్‌ఈడీ వీధిదీపాలు నూరు శాతం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు విజయగాధను త్వరలో జరగనున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో చర్చించాలని నిర్ణయించారు.

04/30/2018 - 00:58

కొండాపూర్, ఏప్రిల్ 29: హైదరాబాద్‌లో శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పి.రాంచంద్రారెడ్డి జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. న్యాయవాద వృత్తిని స్వీకరించిన ఆయన తరువాత రాజకీయాలలోకి అడుగుపెట్టి అయదుసార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా, స్పీకర్‌గా పనిచేశారు.

04/29/2018 - 05:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు కనీవిని ఎరుగని అన్యాయం జరిగిపోయింది.. బీజేపీ ద్రోహం చేసిందని ఆరోపించారు.

Pages