S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/28/2018 - 03:52

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 27: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి జయంత్యుత్సవాలకు శుక్రవారం ఉదయం స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. యాజ్ఞికులు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో, సన్నాయి మేళాల మధ్య శుద్ధి చేసిన మంత్రజలాన్ని ఆలయ ప్రాంగణంలో చల్లి శుద్ధి చేసి మూడు రోజుల పాటు జరిగే జయంత్యుత్సవాలకు నాంది పలికారు. స్వస్తివాచనం పేరిట ఈ కార్యక్రమాన్ని ఆలయంలో విశ్వక్సేనుడి ఎదుట నిర్వహించారు.

04/28/2018 - 02:45

హైదరాబాద్, ఏప్రిల్ 27: గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్టుంది జనం పరిస్థితి. అసలే ఏటీఎంలలో డబ్బుల్లేక అష్టకష్టాలు పడుతుంటే, ఇప్పుడు బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. డబ్బు కోసం ఇంకెన్ని కష్టాలు పడాలిరా దేవుడా? అంటూ దిక్కులు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులకు సెలవులు రావడంతో జనంలో ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయ.

04/28/2018 - 04:18

హైదరాబాద్, ఏప్రిల్ 27: ‘ఈ దేశాన్ని 71 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్, బిజేపీ దద్దమ్మ పార్టీల నిర్వాకం వల్ల వ్యవసాయానికి సాగునీరు లేదు. తాగడానికి మంచినీళ్లు లభించని దుస్థితి. దేశం ఇప్పటికీ కనీస వసతుల లేమితో కటకటలాడుతోంది. కాంగ్రెస్ లేకుంటే బీజేపీ, బీజేపీ లేకుంటే కాంగ్రెస్. ఈ రెండు పార్టీల పెత్తనంలో దేశానికి ఒరిగిందేమీ లేదు. బై ఫాల్ట్ రాజకీయాలకు స్వస్తి పలుకుదాం.

04/28/2018 - 04:16

హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రస్తుతం తెరాస పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం ప్లీనరీ ముగింపు ప్రసంగంలో స్పష్టతనిచ్చారు. కొన్ని వార్త పత్రికలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు 30శాతానికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని, కేబినెట్‌లో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయంటూ రాయడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు.

04/28/2018 - 04:20

హైదరాబాద్, ఏప్రిల్ 27: పదో తరగతి పరీక్షా ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో శుక్రవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. రాష్టవ్య్రాప్తంగా 83.78 శాతం రెగ్యులర్ విద్యార్ధులు, 32.83 శాతం ప్రైవేటు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.

04/28/2018 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 27: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్-2017 తుది ఫలితాల్లో తెలంగాణ అభ్యర్ధి దురిశెట్టి అనుదీప్ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. శుక్రవారం సాయంత్రం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సివిల్ సర్వీసెస్ -2017 తుది ఫలితాలను ప్రకటించింది.

04/28/2018 - 02:26

హైదరాబాద్, ఏప్రిల్ 27: ‘ఈ దేశాన్ని 71 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్, బిజేపీ దద్దమ్మ పార్టీల నిర్వాకం వల్ల వ్యవసాయానికి సాగునీరు లేదు. తాగడానికి మంచినీళ్లు లభించని దుస్థితి. దేశం ఇప్పటికీ కనీస వసతుల లేమితో కటకటలాడుతోంది. కాంగ్రెస్ లేకుంటే బీజేపీ, బీజేపీ లేకుంటే కాంగ్రెస్. ఈ రెండు పార్టీల పెత్తనంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు. బై ఫాల్ట్ రాజకీయాలకు స్వస్తి పలుకుదాం.

04/28/2018 - 02:22

విజయవాడ, ఏప్రిల్ 27: గత ఎన్నికల సమయంలో ‘వస్తున్నా మీ కోసం’ పేరిట చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో సభ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి సచివాలయంలో మీడియా ప్రతినిధుల ఎదుట నాటి తీపి, చేదు అనుభవాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి పాదయాత్రకు, ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రలకు ఎక్కడా పోలికే లేదన్నారు.

04/28/2018 - 02:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: వైద్య విద్యలో పీజీ సీట్ల భర్తీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్ పర్సన్‌టైల్‌ను 15 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యకు సంబంధించిన నీట్ పీజీ కట్ పర్సంటైల్‌ను తగ్గిస్తున్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. పర్సంటైల్‌ను 15 శాతం తగ్గించడం వల్ల నీట్ ద్వారా మెడికల్ పీజీ,ఎస్‌ఎస్ సీట్ల భర్తీ సులభతరం అవుతుంది.

04/28/2018 - 02:18

కర్నూలు, ఏప్రిల్ 27 : రాష్ట్ర రాజధాని అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో మంత్రి అఖిల ప్రియ, సీనియర్ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య జరిగిన వాదనలతో వేడెక్కిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయాల్లో అఖిల, ఏవీల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు చంద్రబాబు శుక్రవారం మరోమారు వారిద్దరినీ అమరావతికి పిలిపించి చర్చించారు.

Pages