S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/11/2018 - 03:24

హైదరాబాద్, ఏప్రిల్ 10: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేతలు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్‌సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల సమన్వయకర్త గౌరీ ప్రసాద్ ఉపాసక్, బీఎస్పీ తెలంగాణ విభాగం నేత బాలయ్యలు పవన్‌కళ్యాణ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

04/11/2018 - 02:57

హైదరాబాద్, ఏప్రిల్ 10: పర్యావరణాన్ని కాపాడేందుకు కొత్త జాతీయ అటవీ విధానం ఉండాలని తెలంగాణ అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. త్వరలో రానున్న జాతీయ అటవీ విధానం ముసాయిదా ప్రతిపాదనలపై చర్చించి, తగు సలహాలు, సూచనలు కేంద్రానికి చేసేందుకు మంగళవారం రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయమైన ‘అరణ్య భవన్’లో వర్క్ షాప్ జరిగింది.

04/11/2018 - 02:40

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 10: అడవుల్లో బహుళ ప్రయోజనాల కందకాల తవ్వకం ప్రత్యేకత సంతరించుకుంది. అటవీ ప్రాంతంలో నీటి సంరక్షణా చర్యల్లో రాజమండ్రి అటవీ సర్కిల్ లక్ష్యాలను అధిగమించింది. అడవుల్లో నీటి నిల్వల కోసం చేపట్టిన నీరు పీల్చుకునే కం దకాల (వాటర్ అబ్జార్షన్ ట్రెంచెస్) తవ్వకం లో శాఖ అధికారులు, క్షేత్రస్థాయి యంత్రాం గం లక్ష్యాలను అధిగమించారు. అడవుల్లో నీరు నిల్వ చేయడంతో వన విస్తరణకు అవకాశం వుంటుంది.

04/11/2018 - 02:15

వికారాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ జన సమితి ఆవిర్భావాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపలేరని సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాలులో టీజేఏసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీజేఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

04/11/2018 - 02:09

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఆధునిక విధానాలను అమలు చేయడం ద్వారా గత ఏడాది దక్షణ మద్య రైల్వే అద్భుతమైన ప్రగతిని సాధించిందని రైల్వే జీఎం వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన ప్రగతి వివరాలను ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా 16 జోన్లకు గాను దక్షిణ మధ్య రైల్వే ఉత్తమ సేవలు అందిస్తున్న జోన్‌గా అవార్డును అందుకుందని చెప్పారు.

04/11/2018 - 02:03

భీమవరం, ఏప్రిల్ 10: వివిధ రకాల పన్నుల మొండి బకాయిల వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తూ ముందుకుసాగుతున్న మున్సిపల్ శాఖ ఏడాది ఆస్తి, కుళాయి పన్నులు ముందస్తుగా చెల్లించేవారికి డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను, కుళాయి పన్ను ఒకేసారి చెల్లించేవారికి ఆ మొత్తంలో ఐదు శాతం డిస్కౌంట్‌గా ఇవ్వనుంది. ఈ నెల 30వ తేదీలోపు చెల్లించేవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

04/11/2018 - 01:58

కర్నూలు, ఏప్రిల్ 10: నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరినట్లుగా ఈ ఏడాది బీజేపీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడానికి నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారిలో అత్యధికులు మరో పార్టీలో చేరడానికి మానసికంగా సిద్ధమై సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

04/11/2018 - 01:57

విజయవాడ, ఏప్రిల్ 10: ఏడాది క్రితం జరిగిన కౌన్సిలింగ్‌లో వేర్వేరు కారణాలతో బదిలీ అయిన 832 మంది ఉపాధ్యాయులు నేటికీ రిలీవ్ కాకుండా ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్నచోటే కొనసాగుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికైనా అందరినీ రిలీవ్ చేయాలన్న ఒత్తిళ్లు పెరుగుతున్న నేపధ్యంలో వీరిని తక్షణం రిలీవ్ చేసే విధంగా ఏపీ పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

04/11/2018 - 01:36

నిజామాబాద్, ఏప్రిల్ 10: రైతు శ్రేయస్సు దృష్ట్యా పసుపు బోర్డు ఏర్పాటు ఉద్యమానికి తనవంతు అడుగులేస్తానని యోగా గురు రామ్‌దేవ్ బాబు వెల్లడించారు. పసుపు రైతులను ఆదుకునేందుకు గడిచిన నాలుగేళ్లుగా ఎంపీ కవిత అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. పసుపు బోర్డు సాధన కోసం ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చాలని, ఆ ఉద్యమానికి తాను మద్దతుగా నిలుస్తానన్నారు.

04/11/2018 - 01:33

హైదరాబాద్, ఏప్రిల్ 10: ‘సింగరేణి గనులున్న గ్రామాలన్నీ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు. అక్కడ వౌలిక సదుపాయాలు కూడా అరకొరగా ఉన్నాయి. వీటికితోడు సింగరేణి బొగ్గు రవాణా వాహనాల వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు కాలుష్యం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుంది’ అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దెబ్బతిన్న రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.

Pages