S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/10/2018 - 02:45

విశాఖపట్నం, ఏప్రిల్ 9: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఓ పక్క, రైల్వే జోన్ కావాలని మరోపక్క సోమవారం విశాఖ ధర్నాలతో హోరెత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావంగా రాష్టవ్య్రాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

04/10/2018 - 02:43

మంగళగిరి, ఏప్రిల్ 9: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరిట జరుపుతున్న పాదయాత్ర సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోకి ప్రవేశించింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగన్మోహనరెడ్డి పాదయాత్రగా పెదవడ్లపూడి మీదుగా ఆత్మకూరు గ్రామ పరిధిలోని కోకాకోలా కంపెనీ సమీపం వరకు నడిచి అక్కడ బస చేశారు.

04/10/2018 - 02:38

కర్నూలు, ఏప్రిల్ 9: కర్నూలు జిల్లాలోని నల్లమల అరణ్యంలో కృష్ణా నది తీరం వెంట చమురు నిక్షేపాల కోసం ఓఎన్‌జీసీ పరీక్షలు చేపట్టారు. ఇప్పటివరకూ శాటిలైట్ ద్వారా తొలి విడత, అక్కడక్కడ ప్రత్యేక బోర్లు వేయడం ద్వారా రెండో విడత పరీక్షలూ నిర్వహించారు. ఈ రెండు పరీక్షల్లోనూ సానుకూల ఫలితాలు రావడంతో మూడవది ప్రధానమైన పరీక్ష నిర్వహించడానికి ఓఎన్‌జీసీ అధికారులు సిద్ధపడుతున్నారు.

04/10/2018 - 04:49

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో చెప్పిన అంశాలు అమలు చేసేలా జనసేన ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుందని , ఈ కార్యాచరణతో అధికార్ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లందరికీ జనసేన అండగా ఉంటుందని, ఢిల్లీలో రాష్ట్రం కోసం నిరసనలు, ఆమరణ దీక్షలు చేస్తున్న పార్లమెంటు సభ్యులకు సంఘీభావం తెలిపింది.

04/10/2018 - 04:42

ఖమ్మం: గడిచిన నాలుగేళ్ళ టీఆర్‌ఎస్ పాలన తెలంగాణకు స్వర్ణయుగంగా మారిందని, ప్రతి పేదవానికి లబ్ధి చేకూర్చటమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్థి శాఖామంత్రి కె తారక రామారావు, రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ, హౌజింగ్ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

04/10/2018 - 01:44

రామడుగు, ధర్మారం, ఏప్రిల్ 9: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని, దీనివల్ల లక్షల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమవడంతో పాటు ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలుగుతాయని కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ చెప్పారు.

04/10/2018 - 04:43

హైదరాబాద్: గ్రామీణ ప్రాంత భూరికార్డుల ప్రక్షాళన పూర్తి కావడంతో ఇకనుంచి దేవాదాయ, వక్ఫ్, పట్టణ ప్రాంత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి చేసిన భూరికార్డుల వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నామన్నారు.

04/10/2018 - 01:38

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెరాస అధికారంలోకి రాగానే దళితుడిని సీఎం చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కేసీఆర్, మాటతప్పి దళితులను మోసగించారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో దళితులు దగా పడ్డారని దుయ్యబట్టారు. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఒక రోజు దీక్ష నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు

04/10/2018 - 04:43

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకరోజు సింగపూర్ పర్యటనకు ఈనెల 12వ తేదీ రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. 13వ తేదీ అక్కడ పర్యటించి రాష్ట్భ్రావృద్ధికి సంబంధించిన పలు కీలక ఒప్పందాల్లో పాల్గొంటారు. అదేరోజు రాత్రి తిరుగు పయనమై విశాఖకు చేరుకోనున్నారు.

04/10/2018 - 04:40

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 12వ తేదీనే విడుదల చేయనున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. మార్కుల జాబితాల డీ కోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 12వ తేదీ నాటికి ఫలితాలు సిద్ధం కాని పక్షంలో 13వ తేదీన విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28 నుండి మార్చి 14 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్టవ్య్రాప్తంగా 9 లక్షల 63వేల 546 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Pages