S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/09/2018 - 12:32

సూర్యాపేట : జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో విషాదం నెలకొంది. విద్యుత్‌షాక్‌తో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటిపైన బట్టలు ఆరేసే తీగను సరిచేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

04/09/2018 - 04:24

హైదరాబాద్: సీపీఎం అఖిల భారత మహాసభలు ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయి. దీనికి హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యా ణ మండపం వేదిక కాబోతోంది. సీపీఎం అగ్ర నాయకులు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్, త్రిపుర మాజీ సీఎంలు, మిత్రపక్షాలైన సీపీఐ, ఎంసీపీఐ తదితర పార్టీల నాయకులు హాజరుకానున్నారు. మొత్తం 850 మంది ప్రతినిధులు, 16 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారు.

04/09/2018 - 02:47

హైదరాబాద్, ఏప్రిల్ 8: రానున్న రోజుల్లో రైళ్ల ప్రమాదాలను ముందే పసిగట్టేందుకు వీలుగా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ‘ట్రైయిన్ కొల్లిషన్ అవాయిడెన్స్ సిస్టమ్’ (టిసిఏఎస్)ను ఏర్పాటు చేసేందుకు రైల్వే శరవేగంగా ప్రయోగాలు చేస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్ పద్దతిలో రైలుకు రక్షణ కల్పించడమే అవుతుంది.

04/09/2018 - 02:49

తిరుపతి, ఏప్రిల్ 8: వయసు పైబడిన వారికి, శారీరక, మానసిక వైకల్య సమస్యలు ఉన్నవారికి టీటీడీ సకల సౌకర్యాలు ఏర్పాటుచేసి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. వారు వేచి ఉండే హాళ్లలో నిరంతరాయంగా పాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

04/09/2018 - 02:40

కడప, ఏప్రిల్ 8: నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, తద్వారా ప్రజలు, సామాన్య వ్యాపారులు తీవ్రకష్టాలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పాలనకు తెరదించేందుకు రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు ఒకే వేదిక మీదకు రావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

04/09/2018 - 02:01

హైదరాబాద్, ఏప్రిల్ 8: దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీ, ఐఐటీ, త్రిబుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆదివారం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 112 నగరాల్లో పరీక్షను నిర్వహించింది. కెమిస్ట్రీ పేపర్ అత్యంత కఠినంగా రాగా, భౌతికశాస్త్రం సులువుగా ఉందని పరీక్ష రాసిన కొందరు విద్యార్థులు తెలిపారు.

04/09/2018 - 01:53

మహబూబాబాద్, ఏప్రిల్ 8: బంగారు తెలంగాణ పేరు చెప్పి సీఎం కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ తన ఇంటిని చక్కదిద్దుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ సర్కారుపై నిప్పుల చెరిగారు.

04/09/2018 - 01:51

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్టవ్య్రాప్తంగా గ్రామగ్రామాన కంటి పరీక్షల నిర్వహణకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధం కావాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందులో భాగంగా అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించాలన్నారు. ఈ మహా యజ్ఞం కోసం ఎన్ని శిబిరాలు, బృందాలు అవసరమవుతాయో ముందుగా ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.

04/09/2018 - 01:25

విజయవాడ, ఏప్రిల్ 8: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆంధ్రుల ఉమ్మడి ఆస్తి అని, భవిష్యత్ తరాలకు కానుక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకూ గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనున్న సంతోష నగరాల సదస్సు నిర్వహణ, తదితర అంశాలపై ఆయన ఏపీ సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.

04/08/2018 - 04:43

భువనగిరి: దేశంలో ఒక్కటవుతున్న ప్రతిపక్షాలను చూసి అమిత్‌షా మైండ్‌సెట్ చెడి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రచేస్తున్నారని మాజీ రాజ్యసభసభ్యుడు వి.హన్మంతరావు ఆరోపించారు.

Pages