S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/26/2020 - 01:34

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ప్రముఖ నటుడు, రచయిత రావికొండలరావు పేరుతో భారత తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ మంగళవారం పోస్టల్ స్టాంప్-కవర్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్‌పై రావికొండలరావు ఫోటో ముద్రించారు. తెలుగు ప్రజలకు అందిన గౌరవంగా దీన్ని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభు త్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా, పోస్టల్ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

02/26/2020 - 01:31

మంత్రాలయం, ఫిబ్రవరి 25: మంత్రాలయంలో గురువైభవ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. శ్రీ రాఘవేంద్రస్వామి 399వ పట్ట్భాషేక మహోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి బంగారు పాదులకు మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు.

,
02/26/2020 - 01:29

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 25: స్తంభోద్భవుడు లక్ష్మీనరసింహుడు కొలువైన యాదాద్రి పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ తిరుపతి యాదాద్రిలో ఫాల్గుణ శుద్ధ తదియ నుండి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి వరకు నిర్వహించే లక్ష్మినరసింహుడి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు సవాహ్నిక దీక్షతో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ నెల 26 నుం డి మార్చి 7 వరకు 11రోజులు అత్యంత వైభవోపేతంగా సాగనున్నాయి.

02/26/2020 - 01:13

హైదరాబాద్, ఫిబ్రవరి 25: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం చెందారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన దంపతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరొకరు

02/25/2020 - 05:26

శ్రీకాళహస్తి : ముల్లోకాలకు అధిపతి ఆదిభిక్షువు... జగద్గురువు అయిన శ్రీ కాళహస్తీశ్వర సమేత జ్ఞాన ప్రసూనాంబ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 3గంటల ప్రాంతంలో కల్యాణోత్సవ ఘట్టం ముగిసింది. రథోత్సవం, తెప్పోత్సవం పూర్తయిన మరునాడు స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. దీనే్న స్కందరాత్రిగా పిలుస్తారు.

02/25/2020 - 04:48

తిరుపతి, ఫిబ్రవరి 24: తనపై వచ్చిన అసత్య ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, కొంతమంది పైశాచిక క్రీడతో ఎదురైన అనుభవాలతో మానసిక క్షోభకు గురై నేడు తిరుమలకు వచ్చానని, భగవంతుడికి అన్నీ తెలుసని టీటీడీ ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్ అన్నారు.

02/25/2020 - 00:53

రేణిగుంట, ఫిబ్రవరి 24: కాచిగూడ నుంచి చిత్తూరుకు వెళుతున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు ఊడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు భయాందోళనలకు గురైన సంఘటన సోమవారం ఉదయం తిరుపతి సమీపంలోని మామండూరు రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది.

02/24/2020 - 01:55

హైదరాబాద్: గ్రీన్ ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం సినిమా హీరో అర్జున్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. తమిళనాడులోని గేరుగాబక్కంలోని తన నివాసంలో హీరో అర్జున్, రోజాతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకి రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్ఫూర్తిగా తీసుకుని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు.

02/24/2020 - 01:51

విజయవాడ, ఫిబ్రవరి 23: ప్రపంచ దేశాలన్నింటినీ నేడు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల సమస్య ఇబ్బందులకు గురిచేస్తోంది. మన దేశంలో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏటా రోడ్ల మీదకు వస్తున్న వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూపోతోంది. దీంతో వాటికి అనుగుణంగా ఇంధనం సరఫరా చేయడం కష్టంగా మారుతోంది.

02/24/2020 - 01:37

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 23: మహా శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆదిదంపతులు సర్వాభరణాలు ధరించి భక్తకోటికి దర్శనమిచ్చేందుకు రథాన్ని అధిష్ఠించి నగరోత్సవానికి బయలుదేరారు. ఆదిదంపతులను కనులారా చూసి తరించటానికి భక్తులు ఆదివారం సాయంత్రం పాతబస్తీ కెనాల్ రోడ్ సెంటర్‌కు పోటెత్తారు.

Pages