S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/28/2018 - 01:24

హైదరాబాద్, మార్చి 27: జాతీయ రాజకీయాల్లో ఇక నుండి క్రియాశీలకపాత్ర పోషిస్తానని సీఎం కే. చంద్రశేఖరరావు ప్రకటించారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చకు కేసీఆర్ మంగళవారం సమాధానమిస్తూ, కాంగ్రెస్, బీజేపీలు దేశానికి మంచి పరిపాలన ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం కీలకభూమిక పోషించనుందని ప్రకటించారు.

03/28/2018 - 03:25

విజయవాడ: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెల 6వరకూ పొడిగిస్తూ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. అసెంబ్లీ బీఏసీ సమావేశ హాల్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30, 31, ఏప్రిల్ 1, 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగవు. ఈ నెల 28, 29, ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి.

03/28/2018 - 01:10

కేంద్రం ఏపీని వంచించింది *6వరకూ నల్లబ్యాడ్జీలతో నిరసన*
2, 3న ఢిల్లీకి సీఎం చంద్రబాబు * పార్లమెంట్ ముగిసేవరకూ నిరసనలు*
అఖిలపక్ష సమావేశం తీర్మానం

03/28/2018 - 02:59

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పునరావాసాన్ని పరుగులు పెట్టించాల్సిన తరుణం ఎదురైంది. పదేళ్ల కాలంలో కేవలం పధ్నాలుగు గ్రామాలకే పరిమితమైన పునరావాసాన్ని సత్వరం పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. పోలవరం గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి అందించాల్సి వుంది.

03/28/2018 - 01:08

అమరావతి, మార్చి 27: రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ ప్రసక్తి లేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే పోరాడి సాధించేవరకూ విశ్రమించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిందని, ముందే మనం పోరాటం ప్రారంభిస్తే నిధులు ఆపేస్తారన్న కారణంతోనే తొందరపడకుండా ఈ నాలుగేళ్లూ ఒత్తిడి చేశామన్నారు.

03/27/2018 - 17:12

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.ఈ నెల 30,31, వచ్చే నెల 1, 5న సెలవుగా ప్రకటించారు. అలాగే 28 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

03/27/2018 - 16:58

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1,2 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. జాతీయ పార్టీ నేతలతో సమావేశమై కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

03/27/2018 - 16:56

హైదరాబాద్: ప్రవేటు యూనివర్శిటీ బిల్లు వద్దని ఐకాస నేత ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు,.

03/27/2018 - 14:11

రీంనగర్‌ను తప్పకుండా లండన్‌లా చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. లోయర్ మానేర్ డ్యాం కింద 90 కిలోమీటర్ల సుందరీకరణ పనులు చేపడుతాం. గోదావరిని 365 రోజులు సజీవంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

03/27/2018 - 13:57

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2018 (2018 ఎల్‌ఏ బిల్ నం.7)ను, ఆ తరువాత తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2018 (నంబర్-2) (2018 ఎల్‌ఏ బిల్ నంబర్ 8) ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

Pages