S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/26/2018 - 13:37

హైదరాబాద్: ఏపీ కమ్యూనిస్ట్ పార్టీల నేతలతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సోమవారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రత్యేకహోదాపై కేంద్ర వైఖరి సహా వివిధ అంశాలపై సమావేశంలో నేతలు చర్చించారు. సీపీఐ రామకృష్ణ, చంద్రశేఖర్, సీపీఎం మధు, వై వెంకటశశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

03/26/2018 - 12:46

అమరావతి :ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో వివిధ విభాగాలకు చెందిన అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత ఎండీగా ఉన్న డీజీపీ మాలకొండయ్య నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు సురేంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

03/26/2018 - 11:58

భద్రాచలం :భద్రాచలం శ్రీ సీతారాముల వారికి తెలంగాణ ప్రభుత్వం, టీటీడీ అధికారులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హైదరాబాద్ మేయర్‌ రామ్మోహన్‌, పలువురు అధికారులు సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు. స్వామివారి కల్యాణోత్సవానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం కి.మీ మేర భక్తుల క్యూలైన్లలో వేచి ఉన్నారు.

03/26/2018 - 11:52

* ముస్తాబైన ఆలయాలు
* వైభవంగా కల్యాణోత్సవం

03/26/2018 - 11:51

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధి మిథిలాస్టేడియం కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణ వేడుక వైభవంగా జరుగుతోంది. భాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాహలం మధ్య కల్యాణమూర్తులను మిథులా స్టేడియంలోని కళ్యాణమండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మిథిలాస్టేడియం ప్రాంగణంలో చలువ పందిళ్లను చాందినీ వస్ర్తాలు, తోరణాలతో అందంగా అలంకరించారు.

03/26/2018 - 04:23

కట్టె కొట్టె తెచ్చె క్లుప్తమీ కథనమ్ము
మూడు ముక్కలందె మోక్షమిచ్చు
రామకథను తెలుపు రామాయణమ్మురా
మనిషి దేవుడయెడి మార్గదర్శి
*
శుభాకాంక్షలు
పాఠకులు, చందాదారులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషులకు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
- చీఫ్ ఎడిటర్

03/26/2018 - 03:18

హైదరాబాద్: నగరంలో నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తిశ్రద్దలతో శ్రీరాముడి శోభయాత్రను పూర్తి కావడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 20 వేల మంది పోలీసుల పహారాలో, నిఘా నీడలో ప్రశాంతంగా పూర్తవడంతో పోలీసులు గండం గడిచిందని అనుకున్నారు. ఆదివారం కావడం, శ్రీరాముడి శోభాయాత్రను కనులారా వీక్షించేందుకు వేలాదిగా తరలి వచ్చారు.

03/26/2018 - 02:28

గుంటూరు, మార్చి 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. వారం రోజులుగా లోక్‌సభలో ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆస్కారం లేకపోవటంతో మంగళవారం నుంచి ప్రత్యేక కార్యాచరణతో దిశానిర్దేశం చేసేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యూహరచన చేశారు.

03/26/2018 - 01:21

వేములవాడ టౌన్, మార్చి 25: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల క ల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివా రం అభిజిత్‌లగ్న సుముహూర్తాన ఉదయం 11.45 గంటలకు కల్యాణాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు.

03/26/2018 - 01:18

తిరుపతి, మార్చి 25: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలి పి, తోమాలసేవ, అర్చనను ఏకాంతంగా నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపం లో ఉదయం 9 నుంచి 11 గంటల వర కు శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్ల కు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించా రు.

Pages