S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/13/2018 - 00:36

సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 180 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ (78) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వంకాయల సోమవారం విశాఖలో తుది శ్వాస విడిచారు.

03/13/2018 - 00:36

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలోని బిఇడి కోర్సులో చేరేందుకు ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఈనెల 15న జారీ చేయనున్నారు. సోమవారం జరిగిన సెట్ కమిటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు.

03/13/2018 - 00:35

హైదరాబాద్, మార్చి 12: బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోందని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ సోమవారం ప్రసంగించారు. సామాన్య ప్రజల జీవితాల్లో సానుకూలమైన, గణనీయమైన ప్రభావాన్ని తీసుకువచ్చిందని, రాష్ట్రంలో అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

03/13/2018 - 00:32

నల్లగొండ, మార్చి 12: శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై తమ నిరసన తెలుపుతు రైతు సమస్యలపై ప్రశ్నించేందుకు పోడియం దగ్గరకు వెళుతున్న కాంగ్రెస్ శాసన సభ్యులను 100మంది మార్షల్స్‌తో అడ్డుకుంటూ తెరాస ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించింద ని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ శాసన సభలో తెరాస

03/13/2018 - 00:31

కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారు*
మండిపడిన మంత్రి హరీశ్‌రావు

03/13/2018 - 00:30

పలువురు మంత్రుల పరామర్శ*
కాంగ్రెస్‌ను అడ్డుకున్న తెరాస

03/13/2018 - 00:29

హైదరాబాద్, మార్చి 12: బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం శాసనసభ, శాసనమండలి ఉమ్మడి సభ కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో దద్దరిల్లిపోయింది. గవర్నర్ ప్రసంగ పాఠం చదువుతుండ గానే, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ రెచ్చి పోయంది. గడబిడ సృష్టించేందుకు వ్యూహం పన్నిందన్న ముందస్తు సమాచారం నేపథ్యంలో, కాంగ్రెస్ సభ్యులను అదుపుచేసేందుకు వందమంది మార్షల్స్‌ను ఉమ్మడి సభలో నిలిపి ఉంచారు.

03/13/2018 - 00:23

బాపట్ల, మార్చి 12: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పటివరకు రాకపోవటానికి సీఎం చంద్రబాబు అసమర్థతే కారణమని వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు సోమవారం బాపట్లలో జరిగిన బహిరంగసభలో బాబు పాలనపై నిప్పులు చెరిగారు.

03/13/2018 - 00:15

విజయవాడ, మార్చి 12: రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలను సాధించుకోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమ్యస్యగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఏ సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చారని ప్రశ్నించారు. అన్యాయం జరిగిందని, అందుకే ఈ పోరాటమని వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని స్థితిలో ప్రధాని ఉన్నారని, అందుకే గట్టిగా అడుగుతున్నామని స్పష్టం చేశారు.

03/12/2018 - 06:23

హైదరాబాద్, మార్చి 11: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 106 స్థానాల్లో విజయం సాధిస్తామని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇచ్చి, వారిని గెలిపించుకుంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం జరిగింది.

Pages