S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/11/2018 - 02:13

ధర్మపురి, మార్చి 10: గోదావరీ తీరస్థ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో సనాతన సంప్రదాయరీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం జరిగిన శ్రీ ఉగ్రనారసింహుని ఏకాంతోత్సవ వేడుకలకు భక్తులు అశేష భక్తులు విచ్చేశారు.

03/11/2018 - 02:01

తడ, మార్చి 10: అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటైన శ్రీసిటి పారిశ్రామిక వాడకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకతమైన రెండు అవార్డులను చేజిక్కించుకొంది. ఆసియా అత్యంత ప్రశంసాత్మక బ్రాండ్ అవార్డుతో పాటు ఇండియాలో 50లోపు బెస్ట్ సీఎఫ్‌వోల అవార్డులను సొంతం చేసుకుంది.

03/11/2018 - 01:22

హైదరాబాద్, మార్చి 10: మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను నగర పోలీసులు అడ్డుకున్నారు. సభ నిర్వహణకు పోలీసులు అనుమతించకపోయినా తాము సభ నిర్వహించి తీరుతామన్న తెలంగాణ జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నిర్ణయం మేరకు శనివారం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

03/11/2018 - 01:19

హైదరాబాద్, మార్చి 10: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా తగ్గుతుండటంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే వేసవిలో నీటి ఎద్దడి గురించి ఆందోళన చెందుతున్నాయి. ఈ రెండు జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతుండడంతో, నీటి వినియోగం, పొదుపుగా వాడకంపై ఎటువంటి చర్యలు తీసుకుంటేబాగుంటుందో వివరించాలని కోరుతూ కృష్ణాబోర్డు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది.

03/11/2018 - 01:05

ఒంగోలు, మార్చి 10: చంద్రబాబు మహానటుడని,నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నో నాటకాలు, డ్రామాలు వేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆస్కార్ టీమ్ కనుక చంద్రబాబును చూసి ఉంటే అవార్డు ఇచ్చేవారని వ్యంగ్యోక్తి విసిరారు.

03/11/2018 - 00:59

అమరావతి, మార్చి 10: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఉత్కంఠగా మారింది. సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కసరత్తు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడుతో సచివాలయంలో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

03/10/2018 - 13:56

హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవం ఈ నెల 26న జరగనుంది. 27న పట్టాభిషేకం. కళ్యాణోత్సవాల వాల్ పోస్టర్, శ్రీ సీతారాముల లగ్న పత్రికను మంత్రులు ఇద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నేడు ఆవిష్కరించారు. వాల్ పోస్టర్లను తెలుగు, హిందీలో ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. కళ్యాణోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు.

03/10/2018 - 13:52

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓ బెయిల్ పార్టీ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుపై ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ పోషించని అసమర్థ పాత్రను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోషిస్తోందన్నారు.

03/10/2018 - 13:44

అమరావతి : అమరావతి సచివాలయంలో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు.

03/10/2018 - 13:38

విజయనగరం: కేంద్రం ఆఖరి బడ్జెట్‌లోనూ ఏపీకి అన్యాయం చేసిందని, ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా జైట్లీ మాట్లాడారని మంత్రి సుజయకృష్ణ మండిపడ్డారు. నాలుగేళ్లుగా సాయం కోసం ఎదురు చూశామని... ఎంత ఒత్తిడి తెచ్చినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.

Pages