S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/10/2018 - 13:37

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్‌ రాజ్యసభ్యులకు మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. టీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మద్దతు తెలిపింది. ఈనెల 23న ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, సోమవారానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుంది.

03/10/2018 - 12:03

హైదరాబాద్ : మిలియన్ మార్చ్ ఏర్పాటుకు టీఎస్ జేఏసీ కోరిన అనుమతిని నగర పోలీసులు నిరాకరించారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌ను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

03/10/2018 - 11:59

హైదరాబాద్: ప్రజలు సోయలోకి వస్తే తమకు పుట్టగతులుండవని ప్రభుత్వం భయపడుతుందని టీజేఎసీ నాయకుడు కోదండరామ్ అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్లనీయకుండా ప్రభుత్వం కార్యకర్తలను నిర్బంధిస్తుందని విమర్శించారు. తన ఇంటిని పోలీసు దిగ్బంధనం చేశారని

03/10/2018 - 05:14

ఖమ్మం, మార్చి 9: కాళ్ళపారాణి ఆరకముందే ప్రమాదం రూపంలో వారిని మృత్యువు వేరు చేసింది. వివాహం వైభవంగా జరిగిందనే ఆనందం నుండి బయటకు రాకముందే వారి కుటుంబం కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు, ఇద్దరు మహిళలు సహా ఐదుగురు దుర్మరణం చెందారు.

03/09/2018 - 17:13

హైదరాబాద్: ఏపీలో రాష్ట్ర మంత్రులది ఒక మాట, కేంద్ర మంత్రులది ఒక మాట. ఏన్టీయేలో కొనసాగుతున్నామని కుంటి సాకులు చెబుతున్నారని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియా మాట్లాడుతూ.. జైట్లీ గతంలో ఏమీ ఇపుడు అదే చెప్పారు. ఆయన మాటల వల్ల ఒరిగిందేమి లేదు. ప్రధానితో జరిగిన ఫోన్ సంభాషణ విషయం గురించి చంద్రబాబు ఎందుకు చెప్పలేదు. అసలు చంద్రబాబు చేశారా? మోదీ చేశారా? అని బొత్స ప్రశ్నించారు.

03/09/2018 - 17:11

గుంటూరు: ఏపీకి ఏమి ఇవ్వలేదో టిడిపి చెప్పండని బిజెపి నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తుంది. రాజధానికి ఇచ్చిన నిధులు ఎంత ఖర్చు చేశారు. టిడిపితో పొత్తు లేకుంటే ఏమి చేయాలో తమ పార్టీ నిర్ణయిస్తుంది. విజయవాడ డ్రైనేజీ పనులు ఎందుకు ఆపేశారు? కడప ఉక్కు, రైల్వే జోన్ పనులు జరుగుతాయని యన్నారు.

03/09/2018 - 16:13

అమరావతి:బిజెపితో పొత్తు వల్ల ఒరిగిందేమి లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాం. కేంద్రమంత్రుల రాజీనామా తరువాత పరిస్థితి ఎలా ఉందని ఆయన ఆరా తీశారు. యూసీలు కావాలంటే ఎప్పటి కప్పుడు పంపించామని ఆయన ఎంపీలకు గుర్తుచేశారు.

03/09/2018 - 17:17

హైదరాబాద్: సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఉద్యమాలు చేసే కుటుంబం మాది కాని ద్రోహం చేసే కుటుంబం కాదని అన్నారు. నా పుట్టుక, చావు కూడా టిఆర్‌ఎస్‌లోనే అని అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై డిఐజికి ఫిర్యాదు చేశానని చెప్పారు. నేను క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తను.

03/09/2018 - 12:00

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతిచెందారు. ఈ మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఎల్బీనగరలోని టిఎన్‌ఆర్ వైష్ణవి శిఖర అపార్ట్‌మెంట్‌లో నివశించే కాంతిపటేల్ వ్యాపారి చిన్న కుమార్తె భార్గవి(15), సహ విద్యార్థిని శ్రావణి ఈ ఘటనలో చనిపోయారు. ఇద్దరు పదవ తరగతి చదువుతున్నారు. మొదటి పరీక్ష రాశారు.

03/09/2018 - 11:59

ఖమ్మం: జిల్లాలోని కొణిజెర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడుతో సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వర్థన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాజీ దుర్గతో పశ్చిమ గోదావు జిల్లా తణుకులో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఇన్నోవా వాహనంలో వర్ధన్నపేటకు వస్తుండగా కొణిజర్ల సమీపంలో ఇన్నోవా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్నది.

Pages