S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/09/2018 - 01:36

కదిరి, మార్చి 8: అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనృసింహుని బ్రహ్మరథోత్సవం గురువారం నేత్రపర్వంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 8.45 గంటలకు పూజాదికాలు నిర్వహించిన అనంతరం రథం ముందుకు కదిలింది. భక్తుల గోవింద నామస్మరణలతో లక్ష్మీ నరసింహుడు తిరువీధులగుండా రథంలో ఊరేగారు. భక్తులు రథంపైకి మిరియాలు, దవణం విసిరి తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు.

03/09/2018 - 01:30

సారంగాపూర్, మార్చి 8: జగిత్యాల జిల్లాలో జైన మతం విస్తృతంగా వ్యాప్తించి ఉండేది అనడానికి ఆధారాలు లభ్యమైనట్ట్టు ప్రముఖ చారిత్రక పరిశోధకులు, దక్కన్ ఆర్కిలాజికల్, కల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, సాలార్‌జంగ్ మ్యూజియం బోర్డు మెంబర్ కుర్రా జితేంద్రబాబు వెల్లడించారు.

03/09/2018 - 01:24

హైదరాబాద్, మార్చి 8: హైదరాబాద్‌లో మహిళా వర్శిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు లలిత కళాతోరణంలో గురువారం అధికారిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20మందికి ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల నగదు, మెమెంటోలతో అవార్డులు అందించారు.

03/09/2018 - 01:21

సిద్దిపేట, మార్చి 8: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ తుగ్లక్ పాలన సాగుతోందని, తలా తోకాలేని నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులను గురి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో మండలాలుగా విభజించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

03/09/2018 - 01:17

హైదరాబాద్, మార్చి 8: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) స్వయం ఉపాధి పథకాలకు అందించే ఆర్థిక సహకారంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే సబ్సిడీ ఇవ్వాలని సీఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనికి సంబంధించిన దస్త్రంపై గురువారం సీఎం సంతకం చేశారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించే నిధులనుంచి స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ అందించాలని సీఎం సూచించారు.

03/09/2018 - 01:16

హైదరాబాద్, మార్చి 8: హైదరాబాద్ నగరం విమానయాన రంగానికి హబ్‌గా మారడంతో తెలంగాణలో ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏవియేషన్ వర్సిటీని నెలకొల్పడానికి అన్ని విధాలుగా తెలంగాణ అనుకూలంగా ఉందని మంత్రి గుర్తు చేసారు.

03/09/2018 - 01:07

హైదరాబాద్, మార్చి 8: రాష్ట్రంలో 8మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు ఐఏఎస్‌లను ముఖ్యమంత్రి కార్యదర్శులుగా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశు సంవర్ధక, మత్స్యశాఖ కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ సుల్తానీయా సీఎంవో

03/09/2018 - 01:56

అమరావతి, మార్చి 8: రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు వైదొలిగారు. ఆ మేరకు మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు బుధవారం రాజీనామా లేఖలను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. నాలుగేళ్లపాటు తమను ప్రోత్సహించి, సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారమే నిర్ణయం తీసుకున్నట్లు సీఎంకు చెప్పారు.

03/09/2018 - 00:59

అమరావతి, మార్చి 8: కేంద్ర మంత్రివర్గం నుంచి నిష్క్రమించాలన్న టీడీపీ నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలని సీఎం చంద్రబాబుని ప్రధాని నరేంద్రమోదీ గురువారం టెలిఫోన్‌లో కోరారు. మంత్రివర్గం నుంచి బయటకు రావాలని బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయం మోదీకి తెలిపేందుకు బాబు ప్రయత్నించినప్పటికీ, ప్రధాని అందుబాటులోకి రాని విషయం తెలిసిందే. దానితో స్వయంగా ప్రధాని గురువారం బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.

03/09/2018 - 00:58

కొత్తగూడెం, మార్చి 8: చర్ల ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు శుక్రవారం బంద్ నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోల బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను చేపట్టారు.

Pages