S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/21/2015 - 10:36

నెల్లూరు , నవంబర్ 20: రోడ్డు మార్గాన నెల్లూరు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కారు నెల్లూరు నగరంలో మద్రాస్ బస్టాండ్ సమీపంలో నీటిగుంటలో దిగిపోయింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయి మరో కారు సిద్ధం చేయడంతో సిఎంను ఆ కారులో ఎక్కి మన్సూర్‌నగర్ వైపు పయనమయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నగరంలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్తుండగా చోటుచేసుకుంది.

11/21/2015 - 06:07

హైదరాబాద్, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు కోడలు, సినీనటుడు బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి ప్రజాసేవకు అరంగేట్రం చేశారు. నారా లోకేష్‌తో వివాహం జరిగిన నాటి నుండి కుటుంబ వ్యాపార వ్యవహారాలను చూస్తూ వచ్చిన బ్రహ్మణి తొలిసారి ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ హోదాలో శుక్రవారం నాడు పాత్రికేయుల ముందుకు వచ్చారు. ట్రస్టు తరఫున చేస్తున్న , చేయబోయే కార్యక్రమాలను ఆమె వివరించారు.

11/21/2015 - 06:01

రఘునాథపల్లి, నవంబర్ 20: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో విధులు నిర్వర్తించడానికి వరంగల్ జిల్లా రఘునాథపల్లికి వచ్చిన మెదక్ జిల్లా చిరాకులపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన పిసి నెంబర్ 1574 గల మునిగెల రాజ్‌కుమార్(48) మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందాడు.

11/21/2015 - 06:01

శ్రీశైలం, నవంబర్ 20: శ్రీశైలం జలాశయానికి దిగువన ఎడమగట్టు పరిధిలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఓవర్ రివర్ వ్యూ డ్యామ్‌కు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో రూ.2 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. 2003 నుంచి ఈ టెయిల్ పాండ్ (ఓవర్ రివర్ వ్యూ) డ్యామ్ నిర్మిస్తున్నారు. సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయి.

11/21/2015 - 05:58

హైదరాబాద్, నవంబర్ 20: సీనియర్ విద్యార్థుల వేధింపులకు లోనైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

11/21/2015 - 05:45

ఏలూరు, నవంబర్ 20: దేశంలోనే తొలిసారిగా పోలీసు విభాగంలో ఇ-ఆఫీసు విభాగాన్ని డిజిపి జెవి రాముడు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో నడుస్తాయని, ఫలితంగా పోలీసు కార్యకలాపాలు వేగంగా, సులభంగా జరుగుతాయన్నారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశపెట్టామని, రానున్న రోజుల్లో మరింతగా విస్తరిస్తామని తెలిపారు.

11/21/2015 - 05:44

విశాఖపట్నం, నవంబర్ 20: అసహనం అన్నది కాంగ్రెస్ జీవకణాల్లోనే ఉందని, సహనం అంటే కమ్యూనిస్టులకు తెలీదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల తీర్పును కాంగ్రెస్ సహించలేక అసహనంతో కుంగిపోతోందని ఆరోపించారు.

11/21/2015 - 05:43

మనుబోలు, నవంబర్ 20: వర్షాలకు జాతీయరహదారి కుంగిపోయి నిన్న రాత్రి నుంచి ఒకపక్కే రాకపోకలు జరుగుతుండగా సిఎం రాక సందర్భంగా పోలీసులు వాహనాల నిలుపుదల చేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పోలీసుల అతి వల్ల నాలుగుగంటలపాటు ప్రయాణికులు నరకం అనుభవించారు.

11/21/2015 - 05:43

శ్రీశైలం, నవంబర్ 20: శ్రీశైలం జలాశయానికి దిగువన ఎడమగట్టు పరిధిలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఓవర్ రివర్ వ్యూ డ్యామ్‌కు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో రూ.2 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. 2003 నుంచి ఈ టెయిల్ పాండ్ (ఓవర్ రివర్ వ్యూ) డ్యామ్ నిర్మిస్తున్నారు. సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయి.

11/21/2015 - 05:41

తిరుమల, నవంబర్ 20: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల ధరలు పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఈమేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదం ధరలు, గదుల అద్దె పెంపు ప్రతిపాదనపై చర్చించేందుకు టిటిడి పాలక మండలి ఏర్పాటు చేసిన హేతుబద్ధీకరణ కమిటీ శుక్రవారం తిరుమల్లోని అన్నవయ్య భవనంలో తొలిసారిగా సమావేశమైంది.

Pages