S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/06/2018 - 12:53

విశాఖపట్నం: నిరసన తెలియజేయటం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. బిజెపి విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.నేను డిఫెన్స్‌లో పనిచేశాను. కేసులకు భయపడను. 2019 తరువాత బిజెపి ఉంటుందో లేదో తెలియదు. ఏ1 నిందితుడు జగన్‌కు ప్రధాని మోదీ వెంటనే అపాయింట్‌మెంట్ ఇస్తారు. ధర్నాకు వచ్చినవారిని రౌడీలు అంటారా? కేసులు ఉన్న సికె బాబును ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

03/06/2018 - 16:51

అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నిరసన ప్రదర్శనలు శృతిమించుతున్నాయని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహాం వ్యక్తంచేశారు. విశాఖపట్నంలో ఎమ్మెల్యే గణేష్ ప్రధాని మోదీని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇది ఎంతమాత్రం తగదని అన్నారు. ప్రధానిని కించపరిచే వాళ్లపై సుమోటాగా కేసు నమోదు చేయాలని, తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, నోరు విప్పితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు.

03/06/2018 - 11:59

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంనాడు ప్రారంభం అయ్యాయి. నిన్న గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదాపడిన విషయం విదితమే. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా.. ఎమ్మెల్యే రామానాయుడు మద్దతు తెలుపనున్నారు.

03/06/2018 - 04:32

హైదరాబాద్, మార్చి 5: భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే వైపు పయనిస్తోందని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పేర్కొన్నారు. విశ్వంజీ 74 వ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు సమీపంలోని స్వామి ఆశ్రమం ‘విశ్వనగర్’లో సోమవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతదేశం మేధావులకు, శాస్తవ్రేత్తలకు, ఆధ్యాత్మిక గురువులకు కేంద్రంగా విలసిల్లుతోందన్నారు.

03/06/2018 - 04:19

హైదరాబాద్, మార్చి 5: స్ట్ఫా సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్‌పై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో గత నెల 17 నుండి 22 వరకూ నిర్వహించిన ఎస్‌ఎస్‌సి సీజీఎల్ టైర్-2 పరీక్షలను తిరిగి నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.

03/06/2018 - 04:15

హైదరాబాద్, మార్చి 5: దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ మనిషి కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ లేని డివిజన్‌గా రికార్డుల్లోకెక్కింది. అన్ని లెవెల్ క్రాసింగ్‌లను తొలగించినట్లు రైల్వే తెలిపింది. 2018 మార్చి నాటికి అన్ని జోన్లలో మనిషి కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు లేకుండా చూడాలన్న రైల్వే బోర్డు ఆదేశం మేరకు సికింద్రాబాద్ డివిజన్ ముందంజలో ఉందని తెలిపింది.

03/06/2018 - 04:14

హైదరాబాద్, మార్చి 5: నాందేడ్-పూర్ణ సెక్షన్‌లో లింబ్‌గోన్-చుడవా రైల్వే స్టేషన్ల మధ్య లైన్‌ను బ్లాక్ చేస్తున్న కారణంగా ఈ నెల 9 నుంచి 11 వరకు ఒక రైలు రద్దు కాగా, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నాందేడ్-ఔరంగాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నెం.17620ను 9వ తేదీన రద్దు చేసినట్లు తెలిపింది.

03/06/2018 - 02:10

ధర్మపురి, మార్చి 5: విదేశీయుల కుట్రలకు బలైన భారతీయ ప్రాచీన సంస్కృతికి పునర్వైభవం తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని హంపీ విరూపాక్ష మహాసంస్థాన జగద్గురు శంకరాచార్య శ్రీవిద్యారణ్య భారతీ స్వామీజీ అన్నారు.

03/06/2018 - 02:07

వరంగల్, మార్చి 5: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవసరం ఉందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆరే సరైనోడని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం వరంగల్ సర్క్యూట్ గెస్టు హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్ దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని అన్నారు.

03/06/2018 - 02:00

హైదరాబాద్, మార్చి 5: ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు తిప్పికొట్టారు. నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తే, మరికొందరిని గృహనిర్బంధం చేశారు. మరికొంత మందిని సోమాజిగూడలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద అరెస్టు చేశారు.

Pages