S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/05/2018 - 04:00

వేములవాడ, మార్చి 4: తెలంగాణ మాగాణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో భక్తజన రంజకమై, భూకైలాసమై వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన ఆదివారం ఉదయం 10.30గంటలకు కల్యాణాన్ని అర్చకులు ప్రారంభించారు.

03/05/2018 - 03:53

తెనాలి, మార్చి 4: గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నెల రోజులుగా జరుగుతున్న నంది నాటకోత్సవాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదుకు అర్హత సాధించేందుకు చేరువవుతున్నాయని కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు, ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) గౌరవాధ్యక్షుడు దిలీప్‌రాజా తెలిపారు.

03/05/2018 - 03:49

ఒంగోలు, మార్చి 4: నోరు తెరిస్తే అబద్దాలు, మోసాలు.. ఇదీ చంద్రబాబు పాలన అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబు మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగబోతున్నందున కొత్త మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కొండచిలువ మాదిరిగా ఉన్నారని, నమ్మితే మింగేస్తారని ధ్వజమెత్తారు.

03/05/2018 - 03:37

భద్రాచలం టౌన్, మార్చి 4: ‘తుపాకీ వదలాల్సి వస్తే పక్కవాడికి అప్పగించు.. కింద మాత్రం పెట్టకు’ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా చత్తీస్‌గఢ్ - తెలంగాణకు ఆనుకొని ఉన్న దండకారణ్యంలో వేళ్లూనుకున్న మావోయిస్టు ఉద్యమం నేడు దారీతెన్నూ తెలియక సతమతమవుతోంది. వరుస ఎన్‌కౌంటర్లతో అగ్రనేతలు, కేడర్‌ను కోల్పోయి నిలువునా కుదేలవుతోంది.

03/05/2018 - 03:20

హైదరాబాద్, మార్చి 4: దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కావాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆదివారం నాడిక్కడ పవన్ మీడియాతో మాట్లాడుతూ థర్డ్ ఫ్రంట్ అనేది కచ్చితంగా ఉండాలని జనసేన కోరుకుంటోందని తెలిపారు.

03/05/2018 - 03:18

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ప్రజల్లో 95 శాతం మంది మాంసాహారులేనని ఒక సర్వేలో వెల్లడైంది. అందుకే కాబోలు..తెలంగాణ ప్రభుత్వం కూడా కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యలు తదితరాల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. సబ్సిడీలు ఇస్తూ వీటి పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

03/05/2018 - 02:56

బోధన్, మార్చి 4: సీఎం కేసీఆర్ మోసాలను వివరించి ప్రజలను చైతన్యపర్చేందుకే ప్రజాచైతన్య యాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తెరాస అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెరాస పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

03/05/2018 - 02:53

హైదరాబాద్, మార్చి 4: జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే తృతీయ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయ. కేసీఆర్ జాతీయ రాజకీయాలను టార్గెట్ చేస్తే, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు వారసుడు ఎవరన్న చర్చకు తెరలేచింది.

03/05/2018 - 02:42

అమరావతి, మార్చి 4: మళ్లీ అవే దృశ్యాలు పునరావృతం కానున్నాయి. విపక్షం లేని సభ దర్శనమివ్వనుంది. అయితే గత సమావేశాల వరకూ మిత్రపక్షంగా వ్యవహరించిన బీజేపీ పాత్ర ఇప్పుడు కొంతమేర మారనుంది. మిత్రపక్షంగా ఉండబోతోందా? ఇటీవల పార్టీ శాసన సభాపక్ష నేత చెప్పినట్లు విపక్షపాత్ర పోషించబోతోందా? అన్నది చూడాలి. సోమవారం నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

03/05/2018 - 02:40

అమరావతి, మార్చి 4: రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా తీర్చిదిద్దడంతో పాటు దేశంలోనే వైద్య రంగానికి రోల్‌మోడల్‌గా రూపుదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్ హాల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయి ఆరోగ్య బులెటిన్‌ను ఆవిష్కరించి, చిన్నారుల ఆరోగ్యం కోసం ‘పలకరింపు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Pages