S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/03/2018 - 02:08

వెంకటాపురం (నూగూరు), మార్చి 2: తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో గిరిజన గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసు బూట్ల చప్పట్లతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు భీతిల్లుతున్నారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయనే కోణంలో పేరూరు, వాజేడు, వెంకటాపురం, చర్ల తదితర పోలీసు స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

03/03/2018 - 02:08

గంగారం, మార్చి 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం ఆలూబాక వద్ధ శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, ఉత్తర తెలంగాణ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, ఆయన భార్య జజ్జరి సమ్మక్క అలియాస్ శారదలు చనిపోయారంటూ వార్తలు రావడంతో వారి సొంత మండలమైన గంగారం ఉలిక్కిపడింది.

03/03/2018 - 01:52

సంగారెడ్డి, మార్చి 2: హోలీ పండుగ సందర్భంగా పటాన్‌చెరు మండలం రుద్రారంలో నిర్వహించిన రంగుల సంబురానికి వెళ్లి వస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంది గ్రామ శివారు 65వ నంబరు జాతీయ రహదారిపై ఐఐటీహెచ్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3.10కు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

03/03/2018 - 01:47

కాంచీపురం, ఫిబ్రవరి 2: ప్రసిద్ధ కంచి పీఠానికి 70వ పీఠాధిపతిగా విజయేంద్ర సరస్వతి నియమితులయ్యారు. కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి నిర్యాణం నేపథ్యంలో ఈ పీఠం సారథ్యాన్ని శ్రీ విజయేంద్ర సరస్వతికి కంచి మఠం అప్పగించింది. కంచి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి రెండు రోజుల క్రితం శివైక్యమైన విషయం తెలిసిందే.

03/03/2018 - 02:05

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ-చత్తీస్‌ఘడ్ సరిహద్దులో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ రెండు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అతి పెద్ద భారీ ఎన్‌కౌంటర్‌గా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. ఇదివరకు ఒకటి రెండు ఎన్‌కౌంటర్లు జరిగినా స్వల్ప ప్రాణ నష్టం జరిగింది.

03/03/2018 - 02:17

హైదరాబాద్, మార్చి 2: మావోయిస్టుల నుంచి ఆత్మరక్షణ కోసమే గ్రేహౌండ్స్ పోలీసులు కాల్పులు జరిపారని డిజిపి ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. కూంబింగ్ కొనసాగుతుండగా తారసపడ్డ మావోయిస్టు గ్రూప్ సభ్యులు తొలుత పోలీసులపై కాల్పులు జరిపి చంపాలని ప్రయత్నించారని వెల్లడించారు. ఆ దాడి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఎదురు కాల్పులు జరపడంతో 10 మంది మావోయిస్టులు చనిపోయారని డిజిపి స్పష్టం చేశారు.

03/03/2018 - 01:40

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్రానికి 24 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్‌కు 9 టీఎంసీ కృష్ణా జలాలను కేటాయిస్తూ కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జలాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీ అధికారులు ఇక్కడ సమావేశమై సమీక్షించారు. నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

03/03/2018 - 01:38

విశాఖపట్నం, మార్చి 2: స్థల సమస్య తలెత్తకుండా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచి నిరంతర విద్యుత్ సరఫరాకు పట్టణ ప్రాంతాల్లో ఇండోర్ సబ్‌స్టేషన్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్నిచోట్ల ఇప్పటికే వీటిని ఏర్పాటు చేసింది కూడా. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతోన్న విశాఖలో గజం స్థలం లభించడం ప్రస్తుతం పెద్ద సవాల్.

03/03/2018 - 01:36

అమరావతి, మార్చి 2: విభజన చట్టం అమలుపై కేంద్ర వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ ఇకపై దానిని జాతీయ అంశంగా మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగు దశల్లో ఒత్తిడి చేయాలని, చివరి అస్త్రంగా కేంద్రం నుంచి బయటకు రావాలని నిర్ణయించింది. రాష్ట్రానికి సాయం చేయకపోగా, మిత్రపక్షంగా ఉన్న తమను మాటలతో రెచ్చగొడుతున్న బీజేపీ రాష్ట్ర నేతల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

03/03/2018 - 01:27

భూపాలపల్లి / నర్సంపేట/ ఖమ్మం/ భద్రాచలం టౌన్, మార్చి 2: తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 10మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ మృతి చెందారు. దీంతో గత ఏడాది హోలీ పండుగనాడు బెజ్జిలో మావోయిస్టులు విరుచుకుపడి 12మంది జవాన్లను హతమార్చిన ఘటనకు అదే హోలీ రోజున పోలీసులు ప్రతీకారం తీర్చుకుట్టయ్యంది.

Pages