S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/28/2018 - 15:31

ముంబై: శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేలా మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పవన్ హన్స్ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 నుంచి అభిమానుల సందర్శనార్థం సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క‍్బ్‌లో ఆమె మృతదేహన్ని ఉంచారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

02/28/2018 - 15:27

ముంబై: శ్రీదేవికు ఇష్టమైన కంచిపట్టు చీరలోనే అంతిమ యాత్రకు ముస్తాబు చేశారు. అంత్యక్రియల కోసం శ్రీదేవి పార్థీవదేహన్ని అందంగా అలంక‌రించారు. నుదటన ఎర్రటి తిలకం దిద్దారు. మెజాంటా రంగు ఉన్న కంచి పట్టు చీరను కట్టారు. ఆమె మెడలో అందమైన ఆభరణాలు కూడా ఉన్నాయి. మల్లెపువ్వులు కూడా ఆమె పక్కనే పెట్టారు. శవపేటికను కూడా అందంగా అలంకరించారు. అంతిమయాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు.

02/28/2018 - 15:13

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అధికారులు ఒక్క నిమిషం నిబంధను పక్కాగా అమలు చేస్తున్నారు పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం 9 గంటలకు వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మొదటి రోజు ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష( తెలుగు, సంస్కృతం, ఉర్దూ తదితర) పరీక్ష జరుగుతోంది.

02/28/2018 - 03:37

ఆదోని/బళ్ళారి, ఫిబ్రవరి 27: కర్నాటక, ఆంధ్ర రైతుల జీవనాడి, రాయలసీకు అన్నపూర్ణగా విరాజిల్లుతోంది తుంగభద్ర జలాశయం. కర్నాటక రాష్ట్రం హొస్పేట వద్ద తంగభద్ర నదిపై ఈ భారీ ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి సరిగ్గా 73 ఏళ్లు. 1945 ఫిబ్రవరి 28వ తేదీ అటు మద్రాసు ప్రెసిడెన్సీ, ఇటు నైజాం స్టేట్‌లో ఒకే సారి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

02/28/2018 - 03:23

విజయవాడ (రైల్వేస్టేషన్), ఫిబ్రవరి 27: మార్చి ఒకటో తేదీ నుండి విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఆరు నుండి కాకుండా 10వ ప్లాట్‌ఫారం నుండి బయలుదేరుతుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 45 రోజుల పాటు ఇదే ప్లాట్‌ఫారం నుంచి బయలుదేరుతుందని తెలిపారు.

02/28/2018 - 02:18

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలోని శాంతా బయోటెక్ సంస్థకు కలరా వ్యాక్సిన్‌ను 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 14 రోజుల వరకు వినియోగించేందుకు అనుమతిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన జారీచేసిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ భాల్గట్ తెలిపారు. శాంతా బయోటెక్నిక్స్‌కు చెందిన సనోఫికి చెందిన వ్యాక్సిన్స్ విభాగం సనోఫి పాశ్చర్ ఓరల్ కలరా వ్యాక్సిన్ షాన్‌కాల్‌ను తయారు చేసింది.

02/28/2018 - 02:03

ధర్మపురి, ఫిబ్రవరి 27: ధర్మపురి క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవాల సందర్భంగా సాయంత్రం అర్చకులు చిలుకముక్కు రమణాచార్య గృహానికి వేంచేసిన స్వాములకు ప్రత్యేక పూజలొనరించారు.

02/28/2018 - 01:57

నల్లగొండ, ఫిబ్రవరి 27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం జరిగిన శ్రీ స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాలతో వైభవోపేతంగా ముగిశాయి. 11రోజుల పాటు నేత్ర పర్వంగా సాగిన పంచ నారసింహుడైన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఆలయం పునర్ నిర్మాణం పనుల నేపథ్యంలో బాల ఆలయంలో నిత్యం పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వేడుకగా సాగాయి.

02/28/2018 - 01:55

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం తన ఉభయదేవేరులతో మలయప్ప స్వామివారు తెప్పలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించి వరాహ పుష్కరణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7గంటల నుంచి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరణిలో విహరించారు.

02/28/2018 - 01:52

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ సిఈవోగా కొత్తవారిని నియమిస్తారా లేక అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సిఇవోను కొనసాగిస్తారా అనే విషయమై రెండు వారాల్లోగా తమ నిర్ణయాన్ని తెలియచేయాలని హైకోర్టు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఆదేశించింది. తిరుపతికి చెందిన పి నవీన్ కుమార్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించి పై ఆదేశాన్ని జారీ చేసింది.

Pages