S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/26/2018 - 01:50

కలా నిజమా అన్నంత దిగ్బ్రాంతి. నిజంకాకపోతే బావుండునన్న చిగురాశ. కానీ మన వసంతకోకిల ఇక లేదు. నాలుగు దశాబ్దాలపాటు యావత్ తెలుగు, తమిళం, కన్నడ, మళయాల, హిందీ చిత్రసీమను తనదైన విలక్షణ నటనతో
అద్వితీయ అందంతో అలరించిన ఈ బంగారక్క హఠాన్మరణం చెందారు. ఓ కవి రాసినట్టుగా ఆమె సినీ జీవితం ఓ కథగా, కల్పనగా యావత్భారత ప్రేక్షకుల

02/25/2018 - 03:36

మధిర, ఫిబ్రవరి 24: భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా ఉన్న రెండు బాక్సులను రైల్వే పోలీసులు రైలు బోగీ నుండి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

02/25/2018 - 03:25

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు రైతులకు చేరేందుకు రైతు సమన్వయ సమితులను పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్థాయి, మండల స్థాయి రైతు సమన్వయ సమితిలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. జిల్లా, రాష్టస్థ్రాయి సమితిలను ఏర్పాటు చేస్తున్నారు.

02/25/2018 - 01:28

హైదరాబాద్, ఫిబ్రవరి 24: భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ ఉద్యోగులకు నెల మూలవేతనాన్ని ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్‌లో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

02/25/2018 - 01:27

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 28 నుంచి, సెకండియర్ పరీక్షలు 29 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 26 నుండి బోర్డు పోర్టల్‌లో హాల్‌టిక్కెట్లు ఉంచుతామని, అభ్యర్ధులు వాటిని డౌన్‌లోడ్ చేసుకుని కూడా పరీక్షలకు హాజరుకావచ్చని చెప్పారు.

02/25/2018 - 04:14

యాదాద్రి లక్ష్మీనరసింహుల కల్యాణం కమనీయంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి
తిరుకల్యాణోత్సవం, వైభవోత్సవ కల్యాణోత్సవాలను శనివారం వైభవంగా నిర్వహించారు. బాల ఆలయంలో
భక్త జనులకు నిండుశోభితంగా దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు.

02/25/2018 - 01:16

అమరావతి, ఫిబ్రవరి 24: ‘నేనూ రాయలసీమ బిడ్డనేనన్న విషయం నన్ను విమర్శించే వాళ్లు గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమకు న్యాయం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు పారిశ్రామికీకరణ, కొత్త పరిశ్రమలన్నీ కర్నూలు, అనంతపురం, తిరుపతిలోనే వస్తున్నాయి. ఇది వికేంద్రీకరణ కాదా’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

02/25/2018 - 01:15

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్న నవ్యాంధ్రలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో శనివారం ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు ప్రధాన వేదికపై సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ ప్లీనరీలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

02/25/2018 - 01:13

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: సమీప భవిష్యత్‌లో ప్రపంచ దేశాలను తలదనే్నలా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోందని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్టప్రతి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదుపదేళ్లలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ఎదగనుందని అన్నారు.

02/24/2018 - 14:36

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం నిరుద్యోగ యువగర్జన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ మేం అధికారంలోకి రూ. 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో నిరుద్యోగంపై ఆందోళనలు చేస్తామని ఆయన అన్నారు.

Pages