S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/23/2018 - 12:15

హైదరాబాద్: జీఎస్టీ వెబ్‌సిరీస్‌ కేసులో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సీసీఎస్‌ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. గత శనివారం సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన వర్మను తదుపరి విచారణ కోసం శుక్రవారం రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే వర్మ ఈరోజు విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని కోరారు.

02/23/2018 - 15:46

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడ సుభాష్‌నగర్‌లో విజయశ్రీ కెమికల్స్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పరిశ్రమలో పనిచేస్తున్న 8 మంది కార్మికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

02/23/2018 - 04:08

విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో రాబోయే 3 సంవత్సరాల్లో 11వేల కోట్ల రూపాయలతో వౌలిక వసతులు కల్పించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. నగరంలో గురువారం ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

02/23/2018 - 04:05

హైదరాబాద్, ఫిబ్రవరి 22: బెంగళూరు కంటోనె్మంట్-అగర్తల మధ్య విజయవాడ మీదుగా నడిచే సూపర్ ఫాస్ట్ రైలు నెం.12503 ఈ నెల 23న వెళ్లాల్సి ఉండగా రీ షెడ్యూల్ చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది. 23వ తేదీకి బదులు 24వ తేదీ ఉదయం ఒంటి గంటకు బయలుదేరుతుందని స్పష్టం చేసింది. ఈ రైలుకు జతగా నడిచే మరో రైలు ఆలస్యంగా నడవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వెల్లడించింది.

02/23/2018 - 02:41

నల్లగొండ, ఫిబ్రవరి 22: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు గురువారం ఉగ్రనృసింహుడు గోవర్థనగిరిధారి అలంకార సేవలో సింహవాహన రూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తి ఇంద్రుడికి గర్వభంగం చేసి గోకులాన్ని, జీవరాశులను సంరక్షించిన సందర్భాన్ని సాక్షాత్కరిస్తూ యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా అలంకృతుడై భక్తజనులకు అభయమిచ్చారు.

02/23/2018 - 02:39

తిరుపతి, ఫిబ్రవరి 22: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి వరాహ పుష్కరిణిలో 5 రోజులపాటు నిర్వహించే తెప్పోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 1 వరకు జరుగుతాయని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. మొదటిరోజు శ్రీరాముల అవతారంలోనూ, రెండోరోజు శ్రీకృష్ణావతారంలోనూ, తక్కిన 3 రోజులు మలయప్పస్వామివారు తెప్పలపై విహరిస్తారన్నారు.

02/23/2018 - 02:37

మంత్రాలయం, ఫిబ్రవరి 22: మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి జయంతి వేడుకలు గురువారం కన్నులపండువగా జరిగాయి. మఠంలో జరుగుతున్న గురువైభవ ఉత్సవాల్లో భాగంగా గురువారం 397వ పట్ట్భాషేక మహోత్సవం, స్వామివారి 423వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యి లీటర్ల పాలతో మూలబృందావనాన్ని అభిషేకించారు. పుష్పాలతో అలంకరించారు. పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

02/23/2018 - 02:34

ఒంగోలు, ఫిబ్రవరి 22: పార్టీ అధికారాన్ని చేపట్టిన వెంటనే రైతులకు తగిన న్యాయం చేస్తానని వైకాపా అధినేత జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర 95వ రోజు గురువారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసి పల్లి మండలం పెద అలవలపాడు శివార్లలోని క్యాంపు నుండి ప్రారంభమై రామాపురం, గుదేవారిపాలెం క్రాస్ రోడ్డు మీదుగా హాజీ పురం వరకు కొనసాగింది.

02/23/2018 - 02:30

మచిలీపట్నం, ఫిబ్రవరి 22: కువైట్ దేశంలో అనధికారికంగా ఉంటున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆ దేశం నుండి మన రాష్ట్రానికి ప్రత్యేక విమాన సర్వీసులు నడిపేందుకు జజీరా ఏయిర్‌వేస్ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన, ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

02/23/2018 - 02:29

ఇది ఎవరూ ఊహించనంత ఖరీదైన వాచ్. దీని విలువ ఏకంగా 2.6కోట్ల రూపాయలు. కేడబ్ల్యుసీ ఎగ్జరియో సంస్థ రూపొందించిన ఈ వాచ్‌ని గురువారం హైదరాబాద్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాదాస్ మార్కెట్లో విడుదల చేశారు.

Pages