S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/23/2018 - 02:24

హైదరాబాద్, ఫిబ్రవరి 22: కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆమోదంతో కళాశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్ది వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.

02/23/2018 - 02:31

ఖమ్మం, ఫిబ్రవరి 22: గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఖమ్మం మిర్చి మార్కెట్ వ్యవహారం ఈ ఏడాది తొలిదశలోనే రైతుల ఆందోళనలకు వేదికైంది. గిట్టుబాటు ధరకోసం రైతులు గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ముట్టడించి, అధికార్లను ఘెరావ్ చేశారు. సముదాయించేందుకు వచ్చిన అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

02/23/2018 - 01:56

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ‘తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి’ పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వ్యవసాయాభివృద్ధి- రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి కార్పొరేషన్ దోహదం చేస్తుందన్నారు. లాభాపేక్షలేని సంస్థగా ఇది పని చేస్తుందన్నారు. సంస్థకు సమకూర్చే నిధులను లక్ష్యాల సాధనకు వినియోగిస్తామన్నారు.

02/23/2018 - 01:44

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో లోపం కనిపిస్తోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తపన పడుతు న్నా, ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు భాగస్వామ్య సదస్సులు జరిగాయి.

02/23/2018 - 01:36

హైదరాబాద్, ఫిబ్రవరి 22: లైఫ్ సైనె్సస్, ఐటీ రంగాల్లో తెలంగాణ దేశంలో ముందువరసలో ఉండటంతోపాటు అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల సరసన నిలుస్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. గురువారం హైటెక్ సిటీలో (హెచ్‌ఐసిసి) ప్రారంభమైన 15వ బయో ఆసియా సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లైఫ్ సైనె్సస్, ఐటీ రంగాలకు కేంద్రం కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

02/23/2018 - 01:31

అనంతపురం, ఫిబ్రవరి 22: ‘మా మనోభావాలు దెబ్బతీయొద్దు. ఆత్మ గౌరవాన్ని కించపర్చకండి. విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయండి’ అని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘రాష్ట్ర విభజనతో నష్టపోయాం. ఈ సమయంలో కొత్త రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ అభివృద్ధికి చేసిన కృషి చాలావుంది. ఈక్రమంలోనే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని పదేపదే కోరాను.

02/23/2018 - 01:28

అనంతపురం, ఫిబ్రవరి 22: వ్యవసాయాధార ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ఇండియా సంస్థకు సంబంధించి 15వ యూనిట్ ఫ్రేమ్ ఇన్‌స్టలేషన్ పనులను గురువారం సంస్థ సీఈఓ హాన్ వూ పార్క్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు.

02/22/2018 - 22:09

హైదరాబాద్, ఫిబ్రవరి 22: రెండు తెలుగు రాష్ట్రాలకు రానున్న వేసవిలో మంచి నీటి ఎద్దడి పొంచి ఉంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణలోని నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆంధ్రాలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో వేల సంఖ్యలో గ్రామాలు కృష్ణా నది నీటిపై ఆధారపడి మంచి నీటి స్కీంలను నిర్మించాయి.

02/22/2018 - 06:19

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ప్రభుత్వం చేపట్టే వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన రైతులు లేదా ఇతరులు తమకు నష్టపరిహారం ఎప్పుడు వస్తుందా అని ఏళ్లతరబడి ఎదురు చూశారు. కాని అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ జోక్యంవల్ల భూములు కోల్పోయిన వారికి వీలైనంత త్వరలో నష్టపరిహారం అందేందుకు ఇటీవల వెలువడిన తీర్పు దోహదపడింది.

02/21/2018 - 06:52

బాలాసోర్, ఫిబ్రవరి 20: అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన మధ్యశ్రేణి అగ్ని-2 క్షిపణిని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగలిగే ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.

Pages