S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/20/2018 - 03:35

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్‌ల స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. విశాఖలో సోమవారం జరిగిన సమావేశంలో సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వదేశీ దేవరాయ్ మాట్లాడుతూ విశాఖలో పలు ప్రభుత్వ రంగం సంస్థలకు అండగా నిలవనున్నట్టు వెల్లడించారు.

02/20/2018 - 03:31

మలికిపురం, ఫిబ్రవరి 19: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో సోమవారం ఓఎన్జీసీ పైపులైన్ నుండి గ్యాస్ లీకేజీ కలవరం సృష్టించింది. గొల్లపాలెం హైస్కూలు సమీపంలో జరిగిన లీకేజీ మరోసారి ప్రజలను భయబ్రాంతులను గురిచేసింది. కరపాక సైట్ నెంబరు 40 నుండి తూర్పుపాలెం జీసీయస్‌కు అనుసంధానమయ్యే పైపులైను నుండి గొల్లపాలెం హైస్కూలు సమీపంలో సోమవారం ఉదయం అయిదు గంటల నుంచి గ్యాస్ పైకి ఎగజిమ్మడం మొదలయ్యింది.

02/20/2018 - 03:19

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 19: కాకినాడ ప్రభుత్వాసుపత్రి మాతాశిశు విభాగం భవనం పైభాగంలో ఉన్న ఎన్‌ఐసియు విభాగంలో సోమవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పసి బిడ్డలకు ప్రాణవాయువు సరఫరాచే సే సీపేప్ మెషిన్ అగ్నికి ఆహుతయింది. ఈ ప్రమాదంతో వార్డులో తల్లులు తమ పసిబిడ్డలను తీసుకుని పరుగులు తీశారు.

02/20/2018 - 02:13

చిత్రాలు..‘బ్యాంకులను కాపాడండి స్వామీ’ అని కోరుకుంటూ చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న పురోహితులు. మొక్కుతున్న భక్తులు

02/20/2018 - 02:09

నల్లగొండ, ఫిబ్రవరి 19: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో సోమవారం విశేషాలంకార, వాహన సేవలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. దశవతారాల్లో వేద రక్షకుడిగా శ్రీ మహావిష్ణువు దాల్చిన తొలి అవతారమైన మత్స్యావతార మూర్తిగా దర్శనమిచ్చిన లక్ష్మినరసింహుడు రాత్రి శేష వాహనంపై విహరించారు.

02/20/2018 - 01:18

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్స్, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులు, రైతులకు ఉచిత పెట్టుబడి వంటివి ఎంతో గొప్ప కార్యక్రమాలని, వీటిని దేశమంతా అధ్యయనం చేసి అమలు చేయాలని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ కితాబునిచ్చారు.

02/20/2018 - 00:03

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: కొత్తగా ఏర్పడిన ఏపీకి రైల్వే జోన్ ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తూర్పుకోస్తా రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్ విభజన మా ఆమోదం లేకుండా ఎలా సాధ్యం. ఒడిశాలో మూడు కొత్త రైల్వే డివిజన్లు కావాలని మూడేళ్లుగా కోరుతున్నాం.

02/20/2018 - 00:01

ఏలూరు, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించి కరవురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉభయగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 40 లక్షల ఎకరాలకు సాగునీరు, 548 గ్రామాలకు తాగునీరు అందించనున్నట్లు చెప్పారు.

02/20/2018 - 00:00

ఏలూరు, ఫిబ్రవరి 19: విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలన్నీ సాధించడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని, దానికి రానున్న రోజుల్లో మరికొన్ని పోరాట రూపాలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆందోళనలు, ఉద్యమాల్లో భాగస్వాములైన సంఘాలు, సంస్థల ప్రతినిధులతో త్వరలోనే సమావేశం నిర్వహించి, వారి ఆలోచనలు కూడా తెలుసుకుని, వాటి ఆధారంగా భవిష్యత్ పోరాటం నడుస్తుందన్నారు.

02/20/2018 - 04:34

హైదరాబాద్: హిమాలయాల నుంచి మానస్- సంకోష్- తీస్త- గంగా- సువర్ణరేఖ- మహానది మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాలని మంగళవారం హైదరాబాద్‌లో జరుగనున్న దక్షిణాది జలవనరుల ప్రాంతీయ సదస్సులో నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు కోరనున్నారు. హిమాలయాల నుంచి నదీ ప్రవాహాలను గోదావరికి మళ్లించడం ఒక్కటే భవిష్యత్ తరాలకు నీటి కొరతను తీర్చగలదని ఆయన ప్రతిపాదించనున్నారు.

Pages