S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/07/2017 - 02:59

హైదరాబాద్, సెప్టెంబర్ 6: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది జల విద్యుదుత్పాదన పూర్తిగా తగ్గిపోయింది. ఒక్క జూరాల విద్యుత్ ప్రాజెక్టు నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడం, ఎగువ రాష్ట్రాల నుంచి ఆశించిన స్ధాయిలో నీటి విడుదల లేకపోవడంతో జల విద్యుదుత్పత్తి పూర్తిగా అంచనాలు తప్పింది.

09/07/2017 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 6: నూతన సంవత్సరం కానుకగా మిషన్ భగీరథ పథకం ద్వారా జనవరి 1నుంచి ఇంటింటికీ తాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మిషన్ భగీరథ పథకం పురోగతిపై మంత్రులు సమీక్షించారు.

09/07/2017 - 02:58

మేడ్చల్/మహేశ్వరం, సెప్టెంబర్ 6: ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసి తెలంగాణకు విమోచన కల్పిస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కె. చంద్రశేఖర్ రావు తన స్వార్ధ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని బిజెపి జాతీయ నేత, కేంద్ర ఆహార ఉత్పత్తి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మండిపడ్డారు.

09/06/2017 - 02:21

జై గణేశా... జై జై గణేశా... నినాదాలతో రాజధాని పురవీధులు పులకించిపోయాయ. పదకొండు రోజుల పాటు నిత్యపూజలు అందుకున్న గణనాథుల నిమజ్జన యాత్ర శోభాయమానంగా సాగింది. నిమజ్జనానికి తరలుతున్న వేలాది గణనాథులను తిలకించేందుకు భక్తజనం పోటెత్తింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన గణనాథులను తనివితీరా తిలకించేందుకు వచ్చిన భక్తులతో ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయ.

09/06/2017 - 02:13

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ..జై, గణపతి బప్పా మోరియా..’ భక్తజనం నినాదాలతో భాగ్యనగరం పులకించి పోయింది. గత 11రోజులుగా పూజలందుకున్న వినాయకుడికి భక్తులు వీడ్కోలు పలికారు. అనంత చతుర్దశి సందర్భంగా మంగళవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్వర్యంలో కన్నుల పండువగా శోభాయాత్ర సాగింది. శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలి వచ్చారు. నగరంలోని రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి.

09/06/2017 - 02:02

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 5: వరద సీజను డిమాండును దృష్టిలో ఉంచుకుని ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. గోదావరి నది ఇసుకకు శ్రేష్ఠమైనదిగా నిర్మాణ రంగంలో పేరుంది. గోదావరి నది వరద పోటుతో ఉండటంతో ప్రస్తుతం చాలా ర్యాంపుల్లో ఇసుక తీసేందుకు అనుమతిలేదు.

09/06/2017 - 01:59

సింహాచలం, సెప్టెంబర్ 5: శ్రీకృష్ణాపురంలో సింహాచలం దేవస్థానం సాగుచేస్తున్న వంద ఎకరాల నృసింహవనంలో అరుదైన అరటిగెల ఆకట్టుకుంటోంది. పూర్తిస్థాయి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తుండడంతో మంచి ఫలితాలు సాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అరటి చెట్టుకు సుమారు 170 కాయలతో పెద్ద గెల వేసింది.ఇక్కడ పండిస్తున్న పంటంతా సింహగిరిపై నిత్యాన్నప్రసాదానికి తరలిస్తామని అధికారులు తెలియజేసారు. అలాగే అలంకారం కోసం

09/06/2017 - 01:56

హైదరాబాద్, సెప్టెంబర్ 5: శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన స్వల్ప వరద నీటి ప్రవాహంతో నీటిమట్టం 800అడుగులకు చేరడం, దాదాపు 30.66టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో మంచి నీటి అవసరాలకు నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఈ విషయమై కృష్ణా బోర్డుకు నేడో, రేపో లేఖ రాయనుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రభుత్వం ఆధీనంలో ఉంది.

09/06/2017 - 01:49

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ నుంచి ఆరుగురు అవార్డులును అందుకున్నారు.

09/06/2017 - 01:45

హైదరాబాద్, సెప్టెంబర్ 5: మద్యం వ్యాపారానికి దసరా పండుగ పీక్ సీజన్. ఈ సీజన్‌లోపుననే మద్యం ధరలను పెంచడానికి రంగం సిద్ధం అయింది. అన్ని రకాల మద్యంపై ధరలు పెంచాలని ప్రభుత్వానికి ఎక్సైజుశాఖ ప్రతిపాదనలు పంపించడంతో ఈ నెల మూడవ వారంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎక్సైజు ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది.

Pages