S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/18/2017 - 01:25

విశాఖపట్నం, నవంబర్ 17: ‘ఐటీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో 20 ఏళ్లుగా మీతో కలిసి చేసిన ప్రయాణం వాస్తవ రూపం దాల్చింది. మరో ఏడాదిపాటు ఈ ప్రయాణాన్ని మరింత వేగంగా కొనసాగిస్తే అద్భుతాలు సాధించవచ్చు..’ అని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. ‘ఏపీ అగ్రిటెక్ సమ్మిట్-2017’ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, ఆంధ్ర భవిష్యత్ రైతులపైనే ఆధారపడి ఉందన్నారు.

11/18/2017 - 01:43

హైదరాబాద్, నవంబర్ 17: ‘లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచండి..’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ‘రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు -కొత్తగా పాలన వ్యవస్థ’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రశ్నలు, సందేహాలకు సిఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. పరిపాలనా సంస్కరణలు, సౌలభ్యం కోసమే జిల్లాల సంఖ్య పెంచామన్నారు.

11/18/2017 - 00:34

హైదరాబాద్, నవంబర్ 17: సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ, పుట్టా మధుకర్, దుర్గం చిన్నయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు సిఎం బదులిస్తూ సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై వివరణ ఇచ్చారు. 12 గనుల్లో ఆరు భూగర్భ గనులు, ఆరు ఉపరితల గనులు ఉన్నాయని అన్నారు.

11/17/2017 - 04:23

హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక ఔత్సాహిక సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఈ నెల 26నే హైదరాబాద్ చేరుకోనున్నారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని భద్రతా అధికారులు గోప్యంగా ఉంచారు. సదస్సును ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

11/17/2017 - 04:19

తిరుపతి, నవంబర్ 16: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం అమ్మవారు శ్రీమన్నారాయణుడి అవతారంలో పెద్దశేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందుభాగాన అశ్వాలు, వృషభాలు, గజరాజులు ఠీవిగా ముందుకు కదులుతుంటే మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మ వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

11/17/2017 - 04:28

చండ్రుగొండ, నవంబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల రెవెన్యూ పరిధిలో సీలింగ్ భూముల హక్కులపై ఆదివాసీలు, గిరిజనేతరుల మధ్య గురువారం తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆదివాసీ మహిళలు, యువకులపై గిరిజనేతరులు దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 1992లో ప్రభుత్వం మండలంలోని అయ్యన్నపాలెం, సీతాయిగూడెం గ్రామాలకు చెందిన ఆదివాసీలకు 7 ఎకరాల భూమిని పంపిణీ చేసి హక్కు పత్రాలు అందజేసింది.

11/17/2017 - 02:59

ఖైరతాబాద్, నవంబర్ 16: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సీఎల్పీ నేత జానారెడ్డి గురువారం అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జానారెడ్డికి వివిధ పరీక్షలు జరిపిన యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన ఊపీరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని నిర్ధారించారు.

11/17/2017 - 02:58

హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్‌లో ఓ టిఆర్‌ఎస్ నేత హత్యకు గురయ్యాడు. వల్లభనేని శ్రీనివాసరావు అనే నాయకుడు సనత్‌నగర్ బస్టాండ్ సమీపంలో హత్యకు గురై ఉండడాన్ని గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు టిఆర్‌ఎస్ నేత శ్రీనివాసరావును బుధవారం అర్ధరాత్రి దాటాక తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

11/17/2017 - 02:56

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను ద్వితీయ అధికార భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ అధికార భాష చట్టానికి సవరణ చేస్తూ, ప్రతిపాదించిన బిల్లును ముఖ్యమంత్రి తరఫున రోడ్లు, భవనాల మంత్రి తుమ్మలనాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు చేసిన సూచనల తర్వాత ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

11/17/2017 - 02:55

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ ధార్మిక పరిషత్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాల పెంపునకు సంబంధించి దేవాదాయ, ధర్మాదాయ చట్టంలో చేసిన సవరణల బిల్లుపై శాసనసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ పరిపాలన సజావుగా సాగేందుకు ధార్మికపరిషత్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

Pages