S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/16/2018 - 01:09

సంగారెడ్డి, ఫిబ్రవరి 15: ఏడుపాయల్లో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి వనదుర్గ్భావాని అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సుగంధ పుష్పాలతో ముస్తాబైన రథంపై ఉత్సవమూర్తి అమ్మవారిని భక్తులు కనులారా వీక్షించి తరించారు.

02/16/2018 - 00:51

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మూసీ నదిపై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు ఇరువైపులా రోడ్లు వేయడానికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. బేగంపేట క్యాంప్ కార్యాలయంలో గురువారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై అధికారులతో మంత్రి చర్చించారు.

02/16/2018 - 00:36

నెల్లూరు, ఫిబ్రవరి 15: ప్రత్యేక హోదా కోసం తాము చేసే పోరాటంతో టీడీపీ కూడా కలిసి రావాలని, ప్యాకేజీ మాటలు కట్టిపెట్టాలని వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం తమ ఎంపీలు ఎలాగూ రాజీనామా చేయనున్నారని, టీడీపీ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జగన్ సూచించారు.

02/16/2018 - 04:13

విజయవాడ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను యథావిధిగా ఈనెల 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహిస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో సెంటర్లు కేటాయించినవారికి మార్చి 3న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

02/16/2018 - 00:29

అమరావతి, ఫిబ్రవరి 15: ప్రత్యేక హోదా వల్ల ఏవి లభిస్తాయో ప్రత్యేక సహాయం (ప్యాకేజీ)వల్ల కూడా అన్నీ సమకూరుతాయని కేంద్రం చెప్పడం వల్లే అందుకు అంగీకరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2016 సెప్టెంబర్ 8న చేసిన ప్రకటనలో కూడా ఆర్థిక మంత్రి జైట్లీ ఇదే చెప్పారన్నారు.

02/15/2018 - 23:47

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీసుకున్న ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైకాపా ఎంపి మిథున్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, వైకాపా ఎంపీల రాజీనామాల నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

02/15/2018 - 21:36

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో టిటిడిపి నేతలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఆయన రాష్ట్ర టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు.

02/16/2018 - 04:16

హైదరాబాద్: విభజన హామీల సాధన విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ఇప్పటికే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ , మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశారు.

02/16/2018 - 04:18

హైదరాబాద్: భారత్‌తో ఇరాన్ సంబంధాలు మెరుగుపడ్డాయని ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రోహనీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన రోహనీ తొలుత హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన న్యూఢిల్లీకి వెళ్తారు. శనివారం నాడు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో, రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌తో భేటీ అవుతారు.

02/15/2018 - 16:12

అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఆయన గురువారంనాడు పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ దీనిపై ఒడిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై చర్చించారు.

Pages