S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/13/2018 - 03:41

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మహానగరవాసులందరు స్వచ్ఛతపై అవగాహనవంతులై, స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగస్వాములైనపుడే స్వచ్ఛసర్వేక్షణ్‌లో నగరానికి అగ్రస్థానం దక్కుతోందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలో మంత్రి స్వచ్ఛ చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.

02/13/2018 - 02:07

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో ప్రతి విద్యాసంస్థ, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

02/13/2018 - 03:45

కర్నూలు, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శిరిగిరిపై వెలసిన శ్రీ మల్లికార్జునస్వామి, శ్రీభ్రమరాంబికమాతలను దర్శించుకోవడానికి సోమవారం సాయంత్రం సమయానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు చేరుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగరోజు మంగళవారం మధ్యాహ్న సమయానికి భక్తుల సంఖ్య సుమారు 3.50 లక్షలకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

02/13/2018 - 01:58

నెల్లూరు, ఫిబ్రవరి 12: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు అలుపెరుగని పోరాటాలకు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం పెదకొండూరు గ్రామంలో ప్రజాసంకల్ప యాత్ర శిబిరంలో సోమవారం వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో జగన్మోహన్‌రెడ్డి అత్యంత కీలక సమావేశం నిర్వహించారు.

02/13/2018 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ప్రముఖ విద్యావేత్త, పాత్రికేయుడు జి. వెంకటరామారావు (83) గత రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని లాల్‌దర్వాజలో నివసిస్తున్న వెంకటరామారావుకు గుండెనొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా, తుదిశ్వాస విడిచారు. సోమవారం అంత్యక్రియలు జరిగాయి.

02/12/2018 - 22:18

హైదరాబాద్, ఫిబ్రవరి 12: కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో ఈ నెల 15న ఢిల్లీలో రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు, ఆయా రాష్ట్రాల నీటిపారుదల, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర జల సంఘం చైర్మన్, నాబార్డు చైర్మన్ తదితర ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది.

02/13/2018 - 01:07

గుంటూరు, ఫిబ్రవరి 12: భూగర్భజలాలను కాపాడుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జల సంరక్షణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో పాలవాగు పూడికతీత పనులతో పాటు నీరు-ప్రగతిలో భాగంగా జలసంరక్షణ రెండవ దశ కార్యక్రమాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

02/12/2018 - 22:13

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హస్సన్ రౌహనీ ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు. ముస్లిం మేథావులు, నేతలు, ఇతర ప్రముఖులను ఉద్ధేశించి ఆయన మాట్లాడతారు. 16వ తేదీన మక్కా మసీదులో నిర్వహించే ముస్లిం ప్రజల సమ్మేళనంలో ఆయన ప్రార్ధనలు చేస్తారు. ఈ కార్యక్రమంలో భిన్నమైన ముస్లిం మత పెద్దలు పాల్గొంటారు. ఇరాన్ అధ్యక్షుడు కాకముందు హస్సన్ హైదరాబాద్ వచ్చారు.

02/12/2018 - 22:11

హైదరాబాద్, ఫిబ్రవరి 12: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో ఎమ్మెస్సీ, బిఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జిఎ రామారావు తెలిపారు.

02/12/2018 - 18:16

హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కంటే ముందే హైదరాబాద్‌లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమం కోసం హైదరాబాద్‌ను 400 యూనిట్లుగా చేశామన్నారు. తడి-పొడి చెత్తను వేరుచేసేందుకు 45లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Pages